చెన్నై మైలాపూరులోని శాంథోమ్ హైరోడ్డులో ఉన్న సమ్మర్ ప్యాలెస్‌లో వీజే జ్యూవెలరీ 'విజన్ జ్యూవెలరీస్' పేరుతో ఒక డైమండ్, గోల్డ్ నగల ప్రదర్శనను శనివారం ప్రారంభించింది. ఇది ఈ నెల 27వ తేదీ వరకు జరుగనుంది. ఈ మూడు రోజుల్లో ఒక కారెట్ వజ్రాభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు రెండు గ్రాముల బంగారు నాణెంను ఉచితంగా అందజేస్తారు. అక్షయ త్రిథియ ప్రత్యేక రాయితీ పేరుతో ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గ్రాము వెండి నాణెంను ఇస్తారు. ఈ ఎగ్జిబిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుళ్ నటరాజన్ ప్రారంభించారు.
ఈ ప్రారంభ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాత సుజాత విజయకుమార్, వీజే జ్యూవెలరీ విజన్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కృష్ణమూర్తి, సి.కృష్ణయ్య శెట్టి గ్రూప్ ఆఫ్ జ్యూవెలరీస్ స్టోర్ హెడ్ ప్రసాద్ కేకే తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఈ తరహా ఆఫర్‌ను ఇప్పటివరకు ఏ ఒక్క ఆభరణ నగల కంపెనీ ఇవ్వలేదని నిర్మాత సుజాత విజయకుమార్ చెప్పారు.