ఇది ఇప్పటికే సెల్టోస్, కరెన్స్‌లో ఉంది. ఈ వాహనంలో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఇవి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేగా పని చేస్తాయి.
ఈ 2024 కియా కార్నివాల్ ఎమ్‌పివిలో హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, బోస్ సరౌండ్ స్పీకర్లు, వెంటిలేటెడ్ సీట్లు వస్తాయని సమాచారం.
భద్రత విషయానికొస్తే, ఈ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్‌లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, హైవే డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సెమీ అటానమస్ డ్రైవ్‌తో పాటు ADAS ఉండవచ్చు.
ఎక్ట్సీరియర్ విషయానికొస్తే, కియా కార్నివాల్, కొత్త మోడల్‌లో హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లలో మార్పులు ఉన్నాయి. కియా గ్రిల్‌ను సిగ్నేచర్ LED DRLలు, T-ఆకారపు స్టైలింగ్‌తో కూడా అప్‌డేట్ చేసింది. బంపర్- టెయిల్ గేట్ కూడా మార్చబడ్డాయి.