పండుగ వేళ వంటగ్యాస్ ధర బాదుడు

ఆదివారం, 1 అక్టోబరు 2023 (12:51 IST)
దేశ వ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో వంట గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. నెలవారీ ధరల సమీక్షలో భాగంగా అక్టోబరు ఒకటో తేదీ నుంచి వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ పెంచిన సిలిండర్ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని చమురు కంపనీలు ప్రకటించాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించాయి. 
 
19 కేజీల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.209 మేర పెంచాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, పండుగ సీజన్‌లో వాణిజ్య సిలిండర్ ధరలు పెంచడం ప్రతి ఒక్కరిపై భారం మోపినట్టయింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1731.50కి చేరగా, కోల్‌కతాలో రూ.1839, హైదరాబాద్ నగరంలో రూ.1956.50, విజయవాడలో రూ.1888.50కి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు