Mangli, Ranna, Priyanka Achar and team
హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ఏలుమలై. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. ఇప్పటి వరకు ఏలుమలై నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి గుండెల్ని మెలిపెట్టి, మనసుల్ని కదిలించే పాటను విడుదల చేశారు.