సమ్మిళిత బ్యాంకింగ్‌ను అత్యంత కీలకాంశంగా కలిగిన యూనివర్శల్ బ్యాంక్, బంధన్ బ్యాంకు తాము సౌరవ్ గంగూలీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నట్లు నేడు వెల్లడించింది. భారత క్రికెట్ మహారాజా మరియు అభిమానులు ముద్దుగా దాదా అని పిలుచుకునే సౌరవ్ గంగూలీ, ఇప్పుడు బ్యాంక్ యొక్క బ్రాండ్ సందేశాన్ని మరింతగా వ్యాప్తి చేయడానికి తోడ్పడటంతో పాటుగా బ్యాంకు ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయనున్నారు.
ఈ ఇరు బ్రాండ్లూ ఒకే తరహా విలువలు పంచుకుంటున్నారు. 2000 సంవత్సరారంభంలో భారత క్రికెట్ టీమ్‌ను సమూలంగా మార్చడంలో గంగూలీ నాయకత్వం వహించారు. అదే రీతిలో బంధన్ బ్యాంక్, భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని బీద వర్గాలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేసి సమూలంగా మార్చింది. ఈ ఇరు బ్రాండ్ల మూలాలూ తూర్పు భారతదేశంలోనే ఉన్నాయి. అయినప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా వీరు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు. గంగూలీ ఓ అంతర్జాతీయ క్రికెటర్. ఆటగాడిగా ఆయన ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు. ఆ తరువాత కెప్టెన్‌గా, ఇప్పుడు అడ్మిన్‌స్ట్రేటర్‌గా ఖ్యాతి గడించాడు. బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ బ్యాంకింగ్ సేవలను అందరికీ చేరువ చేస్తుంది. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాలలో 5,644 బ్యాంకింగ్ ఔట్‌లెట్ల ద్వారా తమ సేవలను అందిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి బంధన్ బ్యాంక్ ఎండీ-సీఈఓ, చంద్రశేఖర్ ఘోష్ మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో సౌరవ్ గంగూలీ ఒకరు. అతని ముందుచూపు, అంకిత భావం, గేమ్ పట్ల నిబద్ధతవంటివి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయి. సౌరవ్ మరియు బంధన్ బ్యాంక్ నడుమ ఎన్నో సారుప్యతలు ఉన్నాయి. గంగూలీ ఓ అంతర్జాతీయ క్రీడాకారుడు. అన్ని వర్గాల నుంచి ఆయనకు చక్కటి గౌరవం ఉంది. ఈ భాగస్వామ్యం తో మేము మరింతగా గుర్తింపు పొందగలమని, బ్రాండ్ పట్ల అవగాహన కూడా పెరుగుతుందని, తద్వారా మా వృద్థి ని మరింత వేగవంతం చేసుకోగలమని భావిస్తున్నాము. దేశవ్యాప్తంగా వినియోగదారులతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు, సమ్మిళిత బ్యాంకింగ్ లక్ష్యం పునరుద్ఘాటించేందుకు ఇది తోడ్పడుతుంది అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, నేను ఈ బంధన్ బ్యాంక్ ఎదిగిన తీరును అతి దగ్గరగా చూశాను. అతి తక్కువ సమయంలో ఈ బ్యాంక్ ఎదిగిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ బ్యాంక్‌లో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, ఇది క్షేత్ర స్ధాయిలో నిలకడగా ప్రభావం సృష్టించడానికి కట్టుబడి ఉంది. ఇది నాకు చక్కగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అంటే కెప్టెన్‌గా ఇప్పుడు అడ్మిన్‌స్ట్రేటర్‌గా దానినే లక్ష్యంగా చేసుకున్నాను. దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంక్‌కు మరింత గుర్తింపు తీసుకువచ్చే బాధ్యత లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు.