ఈ నెలలో బ్యాంకులు క్లోజ్ : జూన్ నెలలో బ్యాంకు సెలవులు ఎన్ని?

మంగళవారం, 1 జూన్ 2021 (13:32 IST)
కరోనా కష్టకాలంలో బ్యాంకులు పనిచేసే వేళలు కూడా అంతంత మాత్రంగానేవున్నాయి. దీనికితోడు జూన్ నెలలో అనేక సెలవులు వస్తున్నాయి. ఫలితంగా ఏకంగా ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణంగా ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు సెలవులు ఉంటాయి. కానీ, ఈ నెలలో వీటికితోడు అదనంగా మరికొన్ని సెలవులు వచ్చాయి. 
 
ఆ ప్రకారంగా జూన్ 6 - ఆదివారం, జూన్ 12 - రెండో శనివారం, జూన్ 13 - ఆదివారం, జూన్ 15 - వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో బ్యాంకులు పని చేయవు), జూన్ 20 - ఆదివారం, జూన్ 25 - గురు హర్‌గోవింద్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్), జూన్ 26 - నాలుగో శనివారం, జూన్ 27 - ఆదివారం, జూన్ 30 - రేమ్నా ని (ఇజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు) కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. జూన్ నెలలో ఒక్క రోజు కూడా బ్యాంకులు సెలవు లేదని చెప్పుకోవచ్చు. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మాత్రం బ్యాంకులు ఎలాగూ పని చేయవు. ఇవి కాకుండా బ్యాంకులు ఇతర హాలిడేస్ అంటూ ఈ నెలలో ఏమీ లేవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు