ఎఫికాన్‌ కీటకనాశినితో భారతీయ రైతు పంటలకు బిఎఎస్‌ఎఫ్‌ మద్దతు

ఐవీఆర్

సోమవారం, 6 మే 2024 (23:36 IST)
గుచ్చితిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు- దిగుబడికి ఇవి కలిగించే నష్టం35 నుంచి 40% ఉంటోంది. ఇవాళ ప్రారంభించబడిన బిఎఎస్‌ఎఫ్‌ కొత్త కీటకనాశిని ఎఫికాన్‌‌తో భారతీయ రైతులు ఈ ఇప్పుడు ఈ సవాలును అధిగమించవచ్చు. బిఎఎస్‌ఎఫ్‌ కొత్త క్రియాశీల పదార్థం ఆక్సాలియాన్‌‌తో ప్రత్యేక ఫార్ములేషన్‌లో ఎఫికాన్‌ శక్తివంతమైంది.
 
తన యొక్క ప్రత్యేక కార్యాచరణ పద్ధతితో, పూర్తిగా కొత్త శ్రేణి కీటకనాశినిలను (గ్రూప్‌ 36-పైరిడాజైన్‌) సూచిస్తున్న కొత్త ఐఆర్‌ఎసి గ్రూప్‌ 36 కింద ప్రవేశపెట్టిన మార్కెట్‌లోని మొట్టమొదటి కాంపౌండ్‌లలో ఎఫికాన్‌ కీటకనాశిని ఒకటి. మార్కెట్‌లో ఇప్పుడున్న ప్రోడక్ట్‌లతో దీనికి తెలిసిన క్రాస్‌-రెసిస్టెన్స్‌ లేదు, కాబట్టి దీనిని సర్వోత్తమ కీటకనాశిని నిరోధకత నిర్వహణ పనిముట్టుగా చేస్తోంది. ఎఫికాన్‌ కీటకనాశిని మొట్టమొదటగా 2023లో ఆస్ట్రేలియాలో ప్రారంభించబడింది. కఠినమైన రసంపీల్చు కీటకాలను అదుపుచేసేందుకు రైతులకు సహాయపడే ఈ కొత్త వినూత్న కెమిస్ట్రీ పొందిన ప్రపంచంలోని తొలి దేశాల్లో భారతదేశం ఒకటి.
 
ఆసియా పసిఫిక్‌ వ్యూహానికి అనుగుణంగా, స్థానిక మార్కెట్‌ అవసరాల కోసం ప్రత్యేకంగా పరిష్కారాలను బిఎఎస్‌ఎఫ్‌ అభివృద్ధి చేస్తోంది. ‘‘బిఎఎస్‌ఎఫ్‌లో, మేము చేసే ప్రతి ఒక్కటి వ్యవసాయంపై ప్రేమతోనే. రైతుల అవసరాలను అర్థంచేసుకునేందుకు వాళ్ళు చెప్పేది వినడానికి మరియు వాళ్ళతో కలిసి పనిచేసేందుకు మేము కట్టుబడ్డాము. కాబట్టి భూమిపై అతిపెద్ద పని అయిన కీటకాల నుంచి పంటలను రక్షించడం మరియు ఉత్పాదకతను పెంచడమే భారీ సవాలును విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడటానికి మేము మా నైపుణ్యాన్నివినియోగిస్తాము,’’ అన్నారు సిమోన్‌ బర్గ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌, ఆసియా పసిఫిక్‌.
 
ఎఫికాన్‌ కీటకనాశిని యొక్క అమూల్యమైన అంశం ప్రత్యేక కార్యాచరణ పద్ధతి. ఇది పేనుబంక, పచ్చ దోమ మరియు తెల్లదోమ లాంటి లక్షిత కీటకాల యొక్క అనేక జీవిత దశలపై ఇది అత్యధిక ప్రభావవంతమైనది. వినియోగించిన మీదట, ఫీడింగ్‌ మరియు మొక్క గాయం నుంచి కీటకాలను ఎఫికాన్‌ త్వరగా ఆపుతుంది. దీని యొక్క అంతర్వాహిక గుణాల వల్ల ఇది సుదీర్ఘ కాలం పాటు అవశేష నియంత్రణ ఇస్తుంది.
 
తన యొక్క అంతర్వాహిక గుణాల వల్ల, కొత్త పంట వృద్ధికి కూడా ఎఫికాన్‌ సుదీర్ఘ కాలం అవశేష నియంత్రణ ఇస్తుంది. ‘‘అనేక రకాల ఇప్పుడున్న రసంపీల్చు కీటకాలను అదుపుచేయడంలో హద్దుల లోపు రైతులకు సహాయపడేందుకు ఈ నవీకరణ బిఎఎస్‌ఎఫ్‌ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ప్రత్తి మరియు కూరగాయలు లాంటి అనేక రకాల పంటల్లో చీడ పీడలపై సమర్థవంతంగా మరియు సుదీర్ఘ కాలం రక్షణ కల్పించేందుకు భారతీయ రైతులకు ఎఫికాన్‌ సహాయపడుతుంది. లేబుల్‌ సూచనల ప్రకారం అప్లై చేసినప్పుడు, పరాగసంపర్కాలతో సహా, లక్ష్యంకాని జీవరాశులు మరియు మిత్ర కీటకాలకు కూడా ఎఫికాన్‌ అత్యధికంగా అనువైనది’’ అంటున్నారు గిరిధర్‌ రణువ, బిజినెస్‌ డైరెక్టర్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌, బిఎఎస్‌ఎఫ్‌ ఇండియా.
 
‘‘ఎఫికాన్‌ యొక్క ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా రైతులకు సహాయపడే కీటకనాశిని పోర్టుఫోలియోను అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యానికి సపోర్టు చేస్తుంది. భారతీయ పరిశ్రమకు మరియు వ్యవసాయానికి సహాయపడటానికి. వాళ్ళ సామర్థ్యాన్ని గరిష్టం చేసేందుకు బిఎఎస్‌ఎఫ్‌ కట్టుబడివుంది. రసంపీల్చు కీటకాల్లో నవీకరణలతో నిరోధకతను అదుపుచేస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు అధునాతన పరిష్కారాలకు ప్రవేశసౌలభ్యం కలిగివుండటానికి భారతీయ రైతులు అర్హులు,’’ అంటున్నారు డా. మార్కో గ్రొజ్‌దానోవిక్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌, బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌. ‘‘సమర్థవంతమైన మరియు స్థిరమైన  పరిష్కారాలను రైతులకు ఇవ్వడం ద్వారా మేము పర్యావరణంపై ప్రభావాన్నితగ్గిస్తూనే ఆహారం కోసం పెరుగుతున్న డీమాండ్‌ తీర్చడానికి వాళ్ళకు సపోర్టు చేయగలమని మేము రూఢిపరచుకున్నాము’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు