డబ్బును రెట్టింపు చేయాలా? ఐతే ఇలా చేయండి.. లక్ష కడితే 2 లక్షలిస్తారట..!?

శుక్రవారం, 10 జులై 2020 (13:02 IST)
డబ్బును రెట్టింపు చేయాలనుకుంటున్నారా? అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. అదేంటో తెలుసుకుందాం. దానిపేరు ఈటీఎఫ్ బాండ్. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం భారత్ బాండ్ ఇటిఎఫ్ రెండవ విడత జూలై 14 న సబ్ స్క్రిప్షన్ మొదలైంది. దీని ద్వారా రూ 14 వేల కోట్ల వరకు సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
 
ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెఈఎల్, ఎన్టీపీసీ, బీడీఎల్, మిధాని లాంటి వాటిల్లో పెట్టుబడిగా పడుతారు. అలాగే ఈ డబ్బును దేశ అభివృద్ధి కోసం వాడుతారు. అంతేకాదు మీకు రిటర్న్‌లో డబుల్ చేసి ఇవ్వడం ఈ ఈటీఎఫ్ బాండ్ ప్రత్యేకత.
 
ఇది దేశంలో మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇందులో తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాగా ఈ ఫండ్ జూలై 17న మూసి వేయనున్నారు. గతంలో 2019 డిసెంబర్‌లో భారత్ బాండ్ ఇటిఎఫ్ సిరీస్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 12 వేల కోట్లు సేకరించారు.
 
భారత్ బాండ్ ఇటిఎఫ్ రెండో బ్యాచ్ జూలై 14న ప్రారంభం కానుంది. బాండ్ల కొనుగోలు జూలై 17న ముగుస్తుంది. దీనిని ఎడెల్విస్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త ఫండ్లలో రూ. 1,000 నుండి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. డీమాట్ లేని పెట్టుబడిదారులు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ పథకం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.
 
మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, దానిపై మీకు 7.58 శాతం రాబడి లభిస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ డబ్బు రూ . 2,07,642కు పెరుగుతుంది. అయితే దీనిపై మీరు రూ. 7,836ను పన్నుగా చెల్లించాలి. అంటే మీకు 1,99,806 రూపాయలు లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు