జియో: డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు ఫ్రీ.. ఎవరికంటే?

ఆదివారం, 7 జూన్ 2020 (11:18 IST)
Jio
ఉచిత డేటా పేరిట సంచలన సృష్టించిన రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్లలో వినియోగదార్లను ఆకట్టుకునే దిశగా చర్యలు చేపడుతోంది. తాజాగా జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

తమ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, రూ.401 నెలవారీ రిఛార్జి ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌, రూ.612, రూ.1208 డేటా వౌచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 
 
ఈ తరహా ఆఫర్‌ ఇప్పటికే ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. రూ.401తో రిఛార్జి చేసుకునే వారికి ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా ఇస్తోంది. ఎయిర్‌టెల్‌కు పోటీగా ఇప్పుడు జియో కూడా ఈ ఆఫర్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది.
 
తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కంపెనీ.. వినియోగదారుల నుంచి భారీ స్పందన రావడంతో శనివారం రాత్రి వివరాలతో పాటు ప్లాన్‌ను లాంఛ్‌ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉంచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు