దేశంలో మోగుతున్న ధరల మోత - గ్యాస్‌పై మళ్లీ వడ్డ

ఆదివారం, 1 మే 2022 (09:20 IST)
దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్, డీజల్ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. 
 
మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈ భారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా, ఒకేసారి 104 రూపాయలను పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2563కు చేరింది. గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు