జనవరి 1, 2022 నుంచి పెరగనున్న సిలిండర్ ధరలు

గురువారం, 30 డిశెంబరు 2021 (10:55 IST)
జనవరి 1,2022 నుంచి సిలిండర్ ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
 
అయితే దీపావళికి ముందే ఎల్పీజీ గ్యాస్ ధరను పెంచారు. కమర్షియల్ సిలిండర్లలోనే ఈ పెంపుదల చేయడం కాస్త ఊరట కలిగించే విషయమే అయినా.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.266 భారీగా పెరిగింది. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 
 
ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పటికీ రూ.2000 మించి ఉంది. అంతకుముందు రూ.1733గా ఉండేది. అదే సమయంలో ముంబైలో రూ.1683కి లభించే 19 కేజీల సిలిండర్ ప్రస్తుతం రూ.1950కి లభిస్తుంది. అలాగే కోల్‌కతాలో 19 కేజీల ఇండేన్ గ్యాస్ సిలిండర్ రూ.2073.50 కాగా, చెన్నైలో 19 కేజీల సిలిండర్ రూ.2133గా లభిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు