ఈ పరిస్థితుల్లో బ్యాంకుల రుణాలను చెల్లించడానికి తమకు అదనపు సమయం అవసరం అని ఎంఎస్ఎంఈల యాజమాన్యాలు పేర్కొన్నాయి. కనుక ఏ నిబంధనల కిందైనా సరే ఎంఎస్ఎంఈలకు రుణాలపై మరోమారు మారటోరియం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
ఇందుకు అనుగుణంగానే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఎఫ్ఐఎస్ఎంఈ ప్రతినిధుల నుంచి ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్నసాధక బాధకాలు తెలుసుకున్నారు. ఇప్పటికే గతేడాది మార్చి నుంచి ఆరు నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపులపై కేంద్రం, ఆర్బీఐ మారటోరియం ప్రకటించాయి.