దేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్తోంది. తాజాగా, ఉన్నవారితో పాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటించింది.
ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 'లూట్ లో' పేరుతో రీఛార్జ్ ప్యాక్‌లను తీసుకొచ్చింది రూ.29, రూ.39, రూ.198, రూ.249, రూ.429, రూ.549 రీఛార్జ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రూ.4కే మొబైల్ డేటాను సైతం ఇస్తోంది.
ఇక రూ.39కే 200 ఎంబీ డేటా ఐదురోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రూ.198 రీఛార్జ్ ప్లాన్‌తో 25 రోజుల కాల పరిమితికి 2.2జీబీ మొబైల్ డేటాను ఇవ్వనుంది. రూ.4,498కి 160 జీబీ డేటాను 365 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.