ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ అంకిత్‌ గుప్తా: ఫ్రాంటియర్‌ అండ్‌ వర్క్‌స్పేసెస్‌గా పదోన్నతి

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:14 IST)
హైదరాబాద్‌, ప్రతిభ పట్ల తమ నిబద్ధత మరియు కార్యకలాపాల నిర్వహణలో నిర్ధిష్టమైన నాయకులు పోషించిన పాత్రను గుర్తించడంతో పాటుగా  ప్రస్తుత మహమ్మారి కారణంగా వ్యాపారంపై భారం పడుతున్న సమయంలో టీమ్స్‌కు స్ఫూర్తి కలిగించిన కారణంగా ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌/లీడర్‌ను  సీఈఓ, ఫ్రాంటి యర్‌ అండ్‌ వర్క్‌స్పేసెస్‌గా నియమించింది.
 
అంకిత్‌ గుప్తా,గత సంవత్సరం ఓయోలో  సీఓఓ అండ్‌ ఎస్‌వీపీ, ఫ్రాంటియర్‌ బిజినెస్‌గా చేరారు. ఇప్పుడు సీఈవో, ఫ్రాంటియర్‌ అండ్‌ వర్క్‌స్పేసెస్‌గా పదోన్నతి పొందారు. ఓయో టౌన్‌ హౌస్‌ సహా ఓయో లైఫ్‌, ఓయో క్యాంపస్‌ మరియు ఓయో హోమ్‌ కార్యకలాపాలను అంకిత్‌ చూడటంతో పాటుగా వ్యాపారాభివృద్ధికి తోడ్పడటం ద్వారా ఓయో యొక్క సామర్థ్యాలను బలోపేతం చేస్తారు. గత కొద్ది నెలలుగా, మహమ్మారి కారణంగా ఫ్రాంటియర్‌ వ్యాపార నమూనా లాభదాయకతపై తీవ్రంగా ప్రభావం పడింది. అంకిత్‌ ముందుండి నడిపించడంతో పాటుగా వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డారు.
 
వృద్ధి పథంలో దీనిని నడపడంతో పాటుగా ఓయో యొక్క భాగస్వాముల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇది అపూర్వంగా ఓయో యొక్క ఆఫరింగ్‌ను అతిథులకు చేర్చడంలో తోడ్పడింది. తన సరికొత్త బాధ్యతలలో అంకిత్‌, ఫ్రాంటియర్‌ వ్యాపారాల యొక్క దీర్ఘకాల విజయాలకు తోడ్పడటంతో పాటుగా ఓయో వర్క్‌స్పేసెస్‌ యొక్క బాధ్యతలనూ చూస్తారు. ఇది ఇప్పటికే ఉన్న మరియు నూతన కంపెనీలతో పాటుగా వ్యక్తిగత ప్రొఫెషనల్స్‌కు భారీ అవకాశాలను సైతం అందించనుంది. ఎందుకంటే, ఈ మహమ్మారి ఆఫీస్‌ ప్రాంగణాలను పునర్నిర్వచించడంతో పాటుగా కో-వర్కింగ్‌ ప్రాంగణాలకూ డిమాండ్‌ను వృద్ధి చేసింది.
 
తమ ఉద్యోగుల పట్ల పూర్తి విశ్వాసాన్ని ఓయో కలిగి ఉంది. అంకిత్‌ గుప్తాతో పాటుగా భారతదేశపు సీనియర్‌ లీడర్‌షిప్‌కు చెందిన మరో ముగ్గురికి సైతం పదోన్నతిని అందించింది. దీని గురించి రోహిత్‌ కపూర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఇండియా అండ్‌ సౌత్‌ఆసియా మాట్లాడుతూ, ‘‘ఓయో వద్ద, మేమెప్పుడూ కూడా ప్రతిభావంతులను పలు దశల్లో ప్రోత్సహిస్తూనే ఉంటాం. మాకు సామర్థ్యం కలిగిన, వైవిధ్యమైన లీడర్స్‌ ఉండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అంకిత్‌తో పాటుగా మిగిలిన వారికి పదోన్నతిని కల్పించడమనేది ఆ దిశగా మరో ముందడుగు.
 
కోవిడ్‌ ముందు సమయంలో వారి స్ఫూర్తిదాయక నాయకత్వం, స్ధిర మైన వ్యాపారాభివృద్ధికి ఈ ప్రాంతంలో తోడ్పడ్డారు. మహమ్మారి ప్రారంభమైనప్పుడు, మా వినియోగదారులు, భాగస్వాములు మరియు సహచరుల ప్రాధాన్యతలను తీర్చడంలో వారు సహాయపడటంతో పాటుగా చురుకుదనం, ఆవిష్కరణలతో వేగంగా ప్రతిస్పందించారు. తమ నూతన బాధ్యతలలో వారు ఓయో తమ కీలక బలాలను నిర్మించుకోవడంలో సహాయపడటంతో పాటుగా మహమ్మారి నుంచి బలంగా బయటపడేందుకు కూడా సహాయపడనున్నారు.
 
వారి మార్గనిర్దేశకత్వంలో మేము ప్రయోజనం పొందగలమని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. వారు ఎంతోమంది ఓయోప్రిన్యూర్లకు స్ఫూర్తి కలిగిస్తూనే సుదీర్ఘమైన ప్రభావాన్ని కేవలం ఓయో వద్ద మాత్రమే కాదు, ఆతిథ్య రంగంపైనే అమితంగా ప్రభావం చూపగలరు’’ అని అన్నారు
 
తన పదోన్నతి గురించి అంకిత్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ఓయో వద్ద గత సంవవత్సర కాలమంతా పూర్తి ఫలప్రదంగా సాగడంతో పాటుగా ఎంతో  నేర్చుకునేందుకు అవకాశమూ అందించింది.  ఈ మహమ్మారి మాకు చురుగ్గా, స్థిరంగా ఉండాలని బోధించింది. అయితే, అన్నిటికి మించి సవాళ్లలోనే అవకాశాలనూ వెదికడటం ఎలాగో నేర్పింది. ఈ సిద్ధాంతం ఓయో యొక్క డీఎన్‌ఏలో లోతుగా చొచ్చుకు పోవడంతో పాటుగా ఈ మహమ్మారిని చూసే కోణంలోనూ మాకు తోడ్పడింది.
 
తద్వారా భవిష్యత్‌ కోసం మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకునేందుకు సహాయపడుతుంది. గత కొద్దినెలలుగా నేను ప్రతి ఒక్కరి నుంచి ఎంతో నేర్చుకున్నాను మరీ ముఖ్యంగా రితేష్‌, రోహిత్‌ల నుంచి చాలా నేర్చుకున్నాను. మా భాగస్వాముల మద్దతుతో వినియోగదారులే లక్ష్యంగా మా కార్యక్రమాలను కొనసాగిస్తాము. మేము మరింతగా ముందుకు వెళ్లేటప్పుడు , నేను మరింత పెద్ద పాత్రను పోషించడానికి మరియు ఓయో తద్వారా ఆతిథ్య రంగ పరిశ్రమకు తోడ్పడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు