స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించటం కోసం కేర్ హాస్పిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టై-అప్

ఐవీఆర్

మంగళవారం, 14 మే 2024 (19:06 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ చైన్‌గా వెలుగొందుతున్న కేర్ హాస్పిటల్స్, తమ బంజారాహిల్స్ యూనిట్లో అత్యాధునిక స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించటం ద్వారా ఒక ప్రతిష్టాత్మక మైలురాయిని చేరుకుంది. అథ్లెట్స్, చురుకైన జీవనశైలి కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేకీకరించిన ఆరోగ్య సంరక్షణలో మార్పును ఈ కేంద్రం తీసుకురానుంది. ఈ కేంద్రాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్స్-హెన్రిచ్ క్లాసేన్, మార్కో జాన్సెన్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహమ్మద్‌లు వరుణ్ ఖన్నా-గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, జస్దీప్ సింగ్-గ్రూప్ సీఈఓ, కేర్ హాస్పిటల్స్, డాక్టర్ సంజీబ్ కుమార్ బెహ్రా, హెచ్‌ఓ‌డి - ఆర్థోపెడిక్స్ & జాయింట్ రీప్లేస్మెంట్, ఇతర క్లినికల్ నిపుణులు, అతిథుల సమక్షంలో ప్రారంభించారు. 
 
"నేడు మేము స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్‌ను పునర్నిర్వచించే ప్రయాణం ప్రారంభించాము. కేవలం అథ్లెట్స్ మాత్రమే కాదు, చురుకైన జీవనశైలిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఇది సేవలను అందించనుంది" అని వరుణ్ ఖన్నా-గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ, "కేవలం గాయాలకు చికిత్స అందించటం మాత్రమే కాకుండా, నివారణపై దృష్టి సారించటం, రీహాబిలిటేషన్, మెరుగైన ప్రదర్శన కనబరచడంలో తోడ్పడటంతో సహా సమగ్రమైన సంరక్షణ అందించడంపై మేము దృష్టి సారించాము. ఈ డిపార్ట్మెంట్ ను ప్రారంభించటం అనేది అథ్లెట్స్, చురుకైన వ్యక్తులకు తమ ప్రయాణపు ప్రతి దశలోనూ మద్దతు అందించాలనే కేర్ హాస్పిటల్స్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని జోడించారు. 
 
స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను కేర్ హాస్పిటల్స్ సీఈఓ జస్దీప్ సింగ్ వెల్లడిస్తూ, "ఈ ప్రారంభంతో, స్పెషలైజ్డ్ కేర్ లోని ఖాళీలను పూరించటం మేము లక్ష్యంగా చేసుకున్నాము. అథ్లెట్స్, చురుకైన జీవనశైలి కలిగిన వ్యక్తులు, వారు వున్న ప్రాంతాలతో సంబంధం లేకుండా అవసరమైన మద్దతు అందుకోగలరని భరోసా అందిస్తున్నాము. కేర్ హాస్పిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ నడుమ ఈ భాగస్వామ్యం, స్పోర్ట్స్ మెడిసిన్‌ను మరింతగా అభివృద్ధి చేయటం, అథ్లెట్ సంక్షేమం ప్రోత్సహించాలనే ఏకీకృత నిబద్ధతను వెల్లడిస్తుంది" అని అన్నారు. 
 
బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని స్పోర్ట్స్ మెడిసిన్ మరియు రీహాబిలిటేషన్ సెంటర్  విస్తృత శ్రేణి లో సేవలు అందించనుంది. వీటిలో గాయం నివారణ కార్యక్రమాలు, అధునాతన రోగ నిర్దారణ పరీక్షలు,  వ్యక్తిగతీకరించిన రీహాబిలిటేషన్ ప్లాన్స్ మరియు స్పోర్ట్స్ న్యూట్రిషన్ కౌన్సెలింగ్‌ వంటివి వున్నాయి. తమ దీర్ఘకాలిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ  మెరుగైన ప్రదర్శన చేయటానికి  వ్యక్తులను శక్తివంతం చేయడం దీని లక్ష్యం.
 
కేర్ హాస్పిటల్స్ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అధికారిక వైద్య భాగస్వామిగా ప్రస్తుతం జరుగుతున్న ప్రీమియర్ టి - 20 క్రికెట్  లీగ్స్  కోసం భాగస్వామ్యం చేసుకుంది. సంయుక్తంగా, ఈ  రెండు సంస్థలూ,  క్రీడల భాగస్వామ్యం మరియు సమాజ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వారు అథ్లెట్లకు ప్రయోజనం చేకూర్చే వినూత్న కార్యక్రమాలను అన్వేషించడం కొనసాగిస్తారు మరియు చురుకైన జీవనశైలిని స్వీకరించేలా  వ్యక్తులను ప్రేరేపిస్తారు. సమాజంలో క్రీడలు మరియు శ్రేయస్సును ప్రోత్సహించే దాని మిషన్‌కు కేర్ హాస్పిటల్స్  కట్టుబడి ఉంది. అథ్లెట్లు మరియు ఔత్సాహికులకు ఒకే విధంగా మద్దతు ఇవ్వడానికి దాని నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు