ఓటు వేయండి- వండర్ లా హైదరాబాద్ పార్క్ టిక్కెట్లపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి

బుధవారం, 22 నవంబరు 2023 (22:17 IST)
ఓటింగ్ ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించే చర్యలలో భాగంగా, భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్‌లలో ఒకటైన వండర్ లా హాలిడేస్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు, హైదరాబాద్ పార్క్ వద్ద తమ ఓటింగ్ మార్క్‌ను చూపించటం ద్వారా టిక్కెట్‌లపై 15% తగ్గింపును పొందవచ్చని ప్రకటించింది. 
 
ఈ కార్యక్రమం గురించి వండర్ లా  హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ అతి ముఖ్యమైన పౌర విధి గురించి వెల్లడించారు, “బాధ్యతగల పౌరులుగా, ఓటు వేయడమనేది  దేశం పట్ల మన కర్తవ్యం ను వెల్లడిస్తుంది. వండర్ లా నుంచి మేము, ఓటు వేయమని వ్యక్తులను ప్రోత్సహించే దిశగా వేసిన ఒక చిన్న అడుగు ఈ కార్యక్రమం అని మేము గట్టిగా నమ్ముతున్నాము" అని అన్నారు. 
 
ఈ ఆఫర్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 3, 2023 వరకు వండర్ లా హైదరాబాద్ పార్క్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో మీరు వండర్ లా వెబ్ సైట్లో ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారా ఈ ఆఫర్‌ను ముందుగానే లేదా వండర్ లా హైదరాబాద్ పార్క్ టికెట్ కౌంటర్లలో ఈ ఆఫర్ నేరుగా పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు