దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు కీలక నిర్ణయం తీసుకుంది. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయివున్నాయి. అనేక రాష్ట్రాల్లో సెంచరీ క్రాస్ అయింది. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు.