సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. స్టాక్ మార్కెట్ అదుర్స్

శుక్రవారం, 24 మే 2019 (18:15 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించింది. దీంతో స్టాక్ మార్కెట్ బుల్ ఒక్కసారిగా పైకెగసింది.


దాదాపు దేశీయ సూచీలు సానుకూల ఫలితాలు చూపించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 623 పాయింట్ల వృద్ధితో 39,434 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 187 పాయింట్ల పెరుగుదలతో 11,844 వద్ద ముగిసింది.
 
ఇకపోతే.. వేదాంత, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జీ ఎంటర్టయిన్ మెంట్ షేర్లు నిఫ్టీలో భారీ లాభాలు పొందగా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను చూరగొన్నాయి. 1823 కంపెనీల షేర్లు ముందంజలో వుండగా, 676 సంస్థల షేర్లు పతనం అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు