ఏఐ జనరేటెడ్ విష్ కార్డులతో దీపావళి వేడుకలను ప్రేరేపిస్తున్న కోకా-కోలా

శనివారం, 11 నవంబరు 2023 (23:22 IST)
ఈ దీపావళి సందర్భంగా కోక-కోలా, కళ మరియు సాంకేతికత మార్గదర్శక కలయికను సగర్వంగా పరిచయం చేసింది. వినియోగదారులు తమ దగ్గరి వారికి, ప్రియమైన వారికి వ్యక్తి గతీకరించిన శుభాకాంక్షలను పంపడంలో సహాయపడటానికి ఒక ఉత్తేజకరమైన మార్పును తీసుకువచ్చింది. ఓపెన్ ఏఐ యొక్క DALL-E, GPT-4 మోడళ్ల అద్భుతమైన సామర్థ్యాలను ఉపయోగిస్తూ, ఈ పండుగ సీజన్ createrealmagic.comపై స్నేహితులు, కుటుంబ సభ్యులకు ప్రేమ మరియు కాంతితో అద్భుత దీపావళి శుభాకాంక్షలను తెలియజేయండి
 
కోక-కోలా ఎల్లప్పుడూ వినియోగదారుల ప్రతిష్టాత్మకమైన వేడుకల్లో భాగంగా ఉంటుంది. ఈ సంవత్సరం అది వ్యక్తిగతీకరించిన దీపావళి శుభాకాంక్షలు సృష్టించడానికి ఒక వినూత్న మార్గాన్ని తీసుకువచ్చింది. ఈ వెలుగుల పండుగ వలె అద్భుతమైన, ఉత్సాహభరితమైన శుభాకాంక్షల కార్డుని ఊహించుకోండి, ఇది సంప్రదాయాన్ని వినూత్నతలతో మిళితం చేస్తుంది, పాతకాలపు సందేశాలను వదిలివేస్తుంది. రంగు రంగుల దివ్వెలతో అలంకరించబడిన విష్ కార్డులు మొదలుకొని చమత్కారభరిత ఆటో-రిక్షాలు, భారతీయ మార్కెట్‌ల క్లాసిక్ గుర్తులు, కోకా-కోలా ఐకానిక్ క్యాన్స్, బాటిల్స్ నుండి రంగురంగుల రంగోలిల వరకు, వినియోగదారులు భారతదేశ దీపావళి హృదయాన్ని ఆవిష్కరించే ఒక కళాఖండాన్ని సృష్టించవచ్చు. భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక మరియు భూటాన్ అంతటా ఈ ప్రచారం చురుకుగా కొనసాగుతోంది.
 
కోకా-కోలా జనరేటివ్ ఏఐ గ్లోబల్ హెడ్ ప్రతిక్ థాకర్ మాట్లాడుతూ, ‘‘కోకా-కోలాలో మేం సంస్కృతి, సృజనా త్మకత, సాంకేతికతల మధ్య చుక్కలను కలుపుతున్నాం. క్రియేట్ రియల్ మ్యాజిక్ ప్లాట్‌ఫామ్ పై కోకా-కోలా ఆర్కైవ్స్ నుండి ఐకానిక్ సృజనాత్మక అంశాలను ఉపయోగించి అసలైన కళాకృతిని రూపొందిం చడానికి ఏఐని ఉపయోగించాల్సిందిగా వినియోగదారులను ఆహ్వానిస్తోంది. భారతదేశంలో ఏఐని ఉప యోగించి ప్రజలు మరియు సంస్కృతి వేడుక చేసుకునేందుకు #MagicWaaliDiwali శుభాకాంక్షలు కార్డ్‌ లు సరైన మార్గం. ఇది ఐకానిక్, నిజమైంది, ఇంకా చెప్పాంటే అద్భుత మాయాజాలం. మా తాజా దీపావళి ప్రచారమే అందుకు నిదర్శనం’’ అని అన్నారు.
 
ఈ ప్రచారంపై కోకా-కోలా ఇండియా & సౌత్ వెస్ట్ ఏషియా ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ & ఎక్స్‌ పీరియన్స్ హెడ్ సుమేలీ ఛటర్జీ మాట్లాడుతూ, ‘‘క్రియేట్ రియల్ మ్యాజిక్’ ప్లాట్‌ఫామ్ సాంకేతికత, మేధస్సు, కళ, సంస్కృతి మరియు కోకాకోలా బ్రాండ్ తాత్వికతని అందంగా పెనవేసింది. దీపావళికి సందర్భంగా, ఈ వేదిక అభిమా నులకు పండుగ సమయంలో వారి భావోద్వేగాలను సృష్టించడానికి, వ్యక్తీకరించడానికి ఒక సృజనాత్మక ఆట స్థలంగా ఉంటుంది. దీనితో, అంతా తమ స్నేహితుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన, వ్యక్తిగతీకరించిన శుభాకాంక్షలను పంపవచ్చు. ఓపెన్ ఏఐ యొక్క DALL-E, GPT-4 మా అభిమానులకు ఈ అనుభవాన్ని సరళంగా, ఇంటరాక్టివ్‌గా, సహజంగా, నిజంగా మాయాజాలంగా మార్చాయి’’ అని అన్నారు.
 
ఓపెన్ ఏఐ సీఓఓ బ్రాడ్ లైట్‌క్యాప్ మాట్లాడుతూ, ‘‘DALL-E, GPT-4లను ఉపయోగించడం ద్వారా కోకా-కోలా వినూత్న స్ఫూర్తిని చూడటం విశేషం. క్రియేట్ రియల్ మ్యాజిక్ ప్లాట్‌ఫామ్ దీపావళి సీజన్  ఆనం దంతో ప్రతిధ్వనించడమే కాకుండా, సాంకేతికత, సృజనాత్మకత సంతోషకరమైన కలయికను కూడా ప్రదర్శి స్తుంది. మా ఏఐ మోడల్‌లు ఉత్సవాలకు జోడించడంలో ఎలాంటి పాత్ర పోషించాయో చూడటం ఆనందంగా ఉంది, ఈ ప్రచారాన్ని నిజంగా గుర్తుండిపోయేలా చేస్తుంది’’ అని అన్నారు.
 
ఈ సంవత్సరం, ఒకే రకమైన సందేశాలు, సీజన్ శుభాకాంక్షలను ఫార్వార్డ్ చేయవద్దు. ఏఐ ద్వారా అందిం చబడే ఒక రకమైన దీపావళి విష్ కార్డ్‌ ని సృష్టించండి. సంప్రదాయాన్ని స్వీకరించి, #Magic WaaliDiwali వేడుక చేసుకోండి, ఈ విషయంలో  మీరు నిస్సందేహంగా ఉండండి. అత్యుత్తమ క్రియేషన్‌లు తగిన క్రెడిట్‌ లతో ముంబై, దిల్లీ NCRలోని ప్రముఖ డిజిటల్ బిల్‌బోర్డ్‌ లలో సగర్వంగా ప్రదర్శించబడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు