ప్రపంచ కప్, దీపావళి పండుగకు రండి.. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఆహ్వానం

బుధవారం, 24 మే 2023 (16:49 IST)
Modi
ఆస్ట్రేలియాలో పర్యటనలో వున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం అల్భనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత అల్బనీస్‌ను మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు. ఈ ఏడాది జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను చూసేందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
సిడ్నీలోని అడ్మిరల్టీ హౌస్‌లో ప్రధాని మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. హౌస్‌లోని సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు