దేశ వ్యాప్తంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!

ఠాగూర్

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (11:41 IST)
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన చేపట్టే చమురు ధరల సవరణలో భాగంగా, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. గృహ వినియోగ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ధరలో మాత్రం మార్పు చేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ.41 మేరకు తగ్గించాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాయి. 
 
ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలను సవరించడం జరుగుతుంది. ఇందులోభాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీన ఈ ధరలను సవరించాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని అయిల్ కంపెనీలు తెలిపాయి. తగ్గిన ధరల ప్రకారం మంగళవారం నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర రూ.1762కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ నగరంలో రూ.1985, చెన్నైలో రూ.1921, ముంబైలో రూ.1713గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు