నవంబరు నెలలో కూడా రూ.1.68 లక్షల కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలైన విషయం తెల్సిందే. అయితే, గత 2022 డిసెంబరుతో పోల్చితే 2023 డిసెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లలో పది శాతం వృద్ధి నమోదైంది. ఏదేమైనా వరుసగా పదో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం.
డిసెంబరు నెల వసూళ్ల వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ జీఎస్టీ రూ.30,443 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.37,935 కోట్లు. సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.84,255 కోట్లు, ఇందులో దిగుమతులపై వసూలైన మొత్తం రూ.41,534 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూపంలో రూ.12249 కోట్లుగా ఇందులో దిగుమతులపై వసూలైన పన్ను రూ.1079 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.