'డిప్ప్‌డ్ ఇన్ బ్లాక్' స్పోర్ట్ SV బ్లాక్ రేంజ్ రోవర్‌ను ఇవాళ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇందులో అద్భుతమైన, రాజీలేని ట్రీట్మెంట్ ఉంటుంది. అల్టిమేట్ లగ్జరీ పెర్ఫార్మెన్స్ SUVగా రేంజ్ రోవర్ స్పోర్ట్ SV యొక్క ఖ్యాతిని ఇది పెంపొందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అద్భుతమైన కార్ 2025 తరువాత ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ క్లయింట్‌లలో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన స్పెసిఫికేషన్‌పై నిర్మించబడిన ఈ ఆల్-బ్లాక్.. కాలాతీత ఆకర్షణతో వస్తుంది. మొదటిసారిగా, రేంజ్ రోవర్ SV రౌండెల్, ఫ్రంట్ గ్రిల్‌పై బ్రాండ్ బ్యాడ్జ్‌లతో సహా విలక్షణమైన బ్లాక్ ఫినిషింగ్‌లు, స్టెల్త్ లాంటి, స్పోర్టింగ్ లగ్జరీ యొక్క బోల్డ్, ధిక్కార వివరణను అందిస్తాయి.
రేంజ్ రోవర్ స్పోర్ట్ SV బ్లాక్‌ను బ్రాండ్ కోసం మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్స్‌టీరియర్ భాగంలోని ప్రతి వివరాలు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చాయి. ఇది ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు మరింత కమాండింగ్ మోడ్‌ని తీసుకు వస్తుంది. ఈ సందర్భంగా రేంజ్ రోవర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మార్టిన్ లింపెర్ట్ మాట్లాడుతూ, “రేంజ్ రోవర్ స్పోర్ట్ SV బ్లాక్ అనేది స్పోర్ట్స్ లగ్జరీ యొక్క సారాంశాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది ధైర్యమైన తిరుగుబాటు యొక్క ప్రకటన.
స్వచ్ఛమైన శక్తి, పనితీరును మిళితం చేసే కఠినమైన, రాజీలేని వైఖరితో మేము ఒక వెహికల్‌ను సృష్టించాము. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తుంది. రేంజ్ రోవర్ డిజైన్ బృందం గతంలో మేము అందించిన బ్లాక్ ప్యాక్‌లు లేదా ఎంపికలతో ముందుకు సాగింది. ప్రతి ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ మూలకానికి అధునాతన నార్విక్ బ్లాక్ ట్రీట్‌మెంట్‌ను ఇచ్చింది. వెహికల్ గ్లాస్‌లో ముంచినట్లుగా ఇది కంటికి కనిపిస్తుంది. మేము రేంజ్ రోవర్‌లో మొదటిసారిగా కొత్త ఫనిషింగ్ లను మరింత శ్రద్ధతో అందిస్తున్నాము. ఇది నిజంగా మా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.” అని అన్నారు.
రేంజ్ రోవర్ స్పోర్ట్ SV బ్లాక్ జులై, గురువారం 10 నుండి ఆదివారం 13 జూలై 2025 వరకు UKలోని గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ప్రివ్యూ చేయబడుతుంది. 2025 చివరి నుండి ఆర్డర్ చేయడానికి క్లయింట్‌లకు ఇది అందుబాటులో ఉంటుంది.