పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. మే నెలలో రెండోసారి

గురువారం, 19 మే 2022 (10:17 IST)
గత కొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి. ఇటీవల నిత్యవసరాల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. మార్కెట్లో కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి. దీనికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలపై పెను భారం పడనుంది. 
 
తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై రూ.3.50 పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.8 పెంచారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. భారత్ లో గ్యాస్ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటాయి.
 
తద్వారా మే నెలలో రెండో సారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పెంచారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది. 
 
ఇటీవలే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా మరోసారి కమర్షియల్ గ్యాస్ ధర పెంచారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై భారాలు పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.200, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.750 పైగా పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు