ప్రపంచ హోమియోపతి దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్‌ బాత్రాస్ ఉచిత కన్సల్టేషన్‌

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (22:49 IST)
హోమియోపతి పితామహుడు డాక్టర్‌ శామ్యూల్‌ హేన్‌మన్‌ జయంతి వేడుకలు పురస్కరించుకుని అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవం చేస్తున్నారు. డాక్టర్‌ బాత్రాస్‌ ఇప్పుడు ‘హీలింగ్‌ పీపుల్‌, ఛేంజింగ్‌ లైవ్స్‌’ అంటూ కాఫీ టేబుల్‌ పుస్తకం ఆవిష్కరించడం ద్వారా సహజసిద్ధమైన, దుష్పరిణామాలు లేని మరియు అత్యంత అందుబాటు ధరలలోని శాస్త్రాన్ని ప్రదర్శిస్తుంది. అంతేకాదు, హోమియోపతి దినోత్సవ సంబరాలను వేడుకచేయడంలో భాగంగా ఈ బ్రాండ్‌ ఇప్పుడు 10 ఏప్రిల్‌ నుంచి 22 ఏప్రిల్‌ 2021 వ తేదీ వరకూ ఉచిత కన్సల్టేషన్‌ను రోగులందరికీ అందిస్తుంది.
 
ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్‌ బాత్రాస్‌ గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకులు డాక్టర్‌ ముకేష్‌ బాత్రా తీర్చిదిద్దారు. దీనిలో 100కు పైగా రోగుల కథలను ప్రత్యేకంగా వెల్లడించారు.  అత్యంత అరుదైన, కష్ట సాధ్యమైన వ్యాధులకు సైతం హోమియోపతి ఏ విధంగా చికిత్సనందించినదీ ఈ పుస్తకంలో ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో జరిగిన ఓ సదస్సులో బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ మరియు ఆయుష్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ శ్రీ శరద్‌ మరాఠీ ఆవిష్కరించారు.
 
హోమియోపతితో  తన అనుభవాలను గురించి బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ రాజీవ్‌ బజాజ్‌ మాట్లాడుతూ ‘‘హోమియోపతి అనగానే ఎప్పుడూ మన మనసుల్లో మెదిలే ఆలోచన ఏమిటంటే ఇది నిరూపిత ఆధారితం కానిది అని. కానీ జీవితం అంటే ఎప్పుడూ ఆధారాలతోనే ఉండదు. ఉదాహరణకు, ఆకర్షణ శక్తిని మనం ఎప్పుడూ అనుభవించాలి కానీ దీని నిరూపణ న్యూటన్‌ తల మీద యాపిల్‌ పడటంతో వెలుగులోకి వచ్చింది. అందువల్ల, నిరూపిత ఆధారిత శాస్త్రం అనేది కీలకమే అయినప్పటికీ, హోమియోపతి మాత్రం అనుభవంతో నడుపబడుతుంది మరియు నిరూపణ అనేది కొద్దికాలంలో వస్తుంది.
 
నా సొంత అనుభవం ప్రకారం, నేను ఎక్జెమా తో ఇబ్బంది పడ్డాను. దీనితో పాటుగా శ్వాససంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. ఆధునిక వైద్యంతో నేను చాలా సంవత్సరాలు చికిత్స తీసుకున్నాను కానీ 2003లో హోమియోపతి వైపు మళ్లాను. హోమియోపతి ఏదైతే వాగ్ధానం చేసిందో దానిని నేను అనుభవించాను. మృదువైన, వేగవంతమైన, శాశ్వత చికిత్స పొందాను. కొద్ది సంవత్సరాల సమయం ఇది తీసుకున్నప్పటికీ నాకున్న సమస్యలన్నీ తీరి పోయాయి. ఎలాంటి లక్షణాలూ ఇప్పుడుకనబడటం లేదు. అదీ ఎలాంటి ప్రతికూల ప్రభావం నా శరీరం పై పడకుండా చికిత్స పొందాను. ప్లాసెబోతో ఈ తరహా ప్రభావం సాధ్యం కాదు..’’ అని అన్నారు.
 
ఆయుష్‌లో హోమియోపతి పాత్రను గురించి శ్రీ శరద్‌ మరాఠీ, ఛైర్మన్‌-ఆయుష్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడిస్తూ, ‘‘డాక్టర్‌ బాత్రాస్‌ను ముంబైలో సందర్శించే అదృష్టం నాకు కలిగింది. డాక్టర్‌ బాత్రాతో పాటుగా అతని నైపుణ్యవంతులైన బృందం చేస్తోన్న కార్యకలాపాలు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. వారు కేవలం హోమియోపతి బిల్లలను అందించడం మాత్రమే కాదు, శాస్త్రీయ పద్ధతిలో సమస్యలకు తగిన పరిష్కారమూ అందిస్తున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని అంతర్జాతీయ ఆరోగ్యపటంలో చేర్చాల్సిన సమయం ఇదని నేను భావిస్తున్నాను. ఇక్కడ నాణ్యమైన, అతి తక్కువ ఖర్చుతో కూడిన హోమియోపతి భారీ స్ధాయిలో అందుబాటులోకి వచ్చింది. కోవిడ్‌ 19 వాస్తవానికి మనకు ఓ అవకాశం అందించడంతో పాటుగా హోమియోపతి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకూ తోడ్పడింది’’ అని అన్నారు.
 
హోమియోపతి విజయం మరియు ఈ కాఫీ టేబుల్‌ పుస్తకావిష్కరణ గురించి డాక్టర్‌ బాత్రాస్‌ గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ముకేష్‌ బాత్రా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో హోమియోపతి ప్రపంచంలో అగ్రగామిగా, హీలింగ్‌ పీపుల్‌, ఛేంజింగ్‌ లైవ్స్‌ పుస్తకాన్ని సమర్పిస్తుండటం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అత్యంత అరుదైన, చికిత్సనందించడానికి సైతం కష్టమైన కేసుల సమాహారం ఇది. ఏడు దేశాలలోని 400 మందికి పైగా మా డాక్టర్లు విజయవంతంగా వీటికి చికిత్సనందించారు. హోమియోపతి రంగానికి తోడ్పాటుదారునిగా మేము ఈ కాపీలను మెడికల్‌ లైబ్రరీలు, ఇనిస్టిట్యూషన్‌లు, కాలేజీలకు పంపిణీ చేయనున్నాం.
 
ప్రపంచ హోమియోపతి దినోత్సవ సందర్భంగా, ఉచిత హోమియోపతి చికిత్సను సైతం అందించడానికి మేము వాగ్ధానం చేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 50 వేలమంది నిరుపేదలకు ఈ చికిత్సలను అందించనున్నాం. అదనంగా, కోవిడ్‌ మహమ్మారి రెండవ దశ కొనసాగుతున్న వేళ, క్లినిక్స్‌ సందర్శిస్తున్న రోగులకు అర్శెనిక్‌ అల్బమ్‌ 30 మాత్రలను సైతం ఉచితంగా పంపిణీ చేయనున్నాం’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు