పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. రూ.7 లక్షల వరకు బీమా

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 
 
ఇకపై పీఎఫ్ ఖాదారులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇది వరకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.6 లక్షల బీమా కవరేజ్ లభించేది. 2020 సెప్టెంబర్ 9న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు ఈపీఎఫ్ఓ చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ CBT ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే ఈ నిర్ణయం అప్పటి నుంచి అమలులోకి రాలేదు. అయితే ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బీమా కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసిందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు