వీడియోకాన్ రుణాలు మంజూరు కేసు - చందాకొచ్చర్ అరెస్ట్

శనివారం, 24 డిశెంబరు 2022 (10:27 IST)
వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరులో చోటు చేసుకున్న అవినీతి కేసుల్లో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్టు చేసింది. చందా కొచ్చర్ బ్యాంకు సీఈవోగా ఉన్నసమయంలో తన పరపతిని ఉయోగించి రూ.3,250 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేసింది.

తద్వారా కొచ్చర్ ఫ్యామీలీ కూడా లబ్దిపొందినట్టు సమాచారం. వీడియోకాన్‌కు ఇంత భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేయడంతో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ గత 2018లో బ్యాంకు సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
 
కాగా, ఈమె సీఈవోగా ఉన్న సమయంలో అంటే 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3250 కోట్ల రుణాన్ని ఆమె మంజూరు చేశారు. ఆ తర్వాత అది ఎన్పీఏగా మారింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ ఈ రుణాల మంజూరు తర్వాత చందా కొచ్చర్ కుటుంబం భారీగా లబ్దిపొందినట్టు అభియోగాలుమోపింది. ఈ కేసులోనే చందా కొచ్చర్ దంపతులను సీబీఐ తాజాగా అరెస్టు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు