డ్రైవింగ్ ప్రియుల ఆసక్తిని పునరుత్తేజపరచడానికి స్కోడా ఆటో ఇండియా ఓ సరికొత్త లెజెండ్‌ని తిరిగి తీసుకొస్తోంది, అదే Octavia RS. సరికొత్త Octavia RS ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 6, 2025న ప్రారంభం కానున్నాయి, దీంతో స్కోడా ఆటో వారి అత్యంత పనితీరు చూపించే సెడాన్ తిరిగి మార్కెట్లోకి వచ్చినట్టయింది. ఈ గ్లోబల్ ఐకాన్ భారతదేశంలో పూర్తి-నిర్మిత యూనిట్(FBU)గా పరిమిత లభ్యతతో అందుబాటులోకి రానుంది. ఈ ప్రారంభంతో, స్కోడా ఆటో ఇండియా వారు సరిలేని డ్రైవింగ్ డైనమిక్స్, అద్భుతమైన డిజైన్, సాటిలేని RS చైతన్యం అన్ని కలగలసిన గొప్ప పనితీరు కనబరిచే వాహనాన్ని మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
Octavia RS మళ్లీ మార్కెట్‌లోకి రావడం గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్, ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, ఈ ఏడాది మొదట్లో భారతదేశానికి గ్లోబల్ ఐకాన్ తిరిగి వస్తోందని మేము మాటిచ్చాం. ఈరోజు, Octavia RSను ఆవిష్కరించి ఆ మాటను నిలబెట్టుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ బ్యాడ్జ్ గొప్ప వైభవంతో, దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా డ్రైవింగ్ ప్రియులను ఆకట్టుకున్న చరిత్ర కలిగి ఉంది. భారతదేశంలో ఈ సరికొత్త Octavia RS ప్రారంభంతో, మేము కారును మాత్రమే కాకుండా ఒక భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పనితీరు, ఉత్సాహానికి, డ్రైవింగ్ స్ఫూర్తికి ఈ కారు ఒక ప్రతీకగా నిలిచింది.
ఐకాన్ ప్రీ-బుకింగ్
2025లో సరికొత్త Octavia RS తిరిగిరాకతో మరోసారి ఈ స్ఫూర్తిదాయక ఐకాన్, గతంలో ఎన్నడూ లేనంత షార్ప్‌గా, బోల్డ్‌గా, ఎక్స్‌క్లూజివ్‌గా మారింది. అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్ 6, 2025న ఆక్టోవియా RS ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఇవి పరిమిత సమయం పాటే అందుబాటులో ఉంటాయి.
RS బ్యాడ్జ్
RS బ్యాడ్జ్ పూర్తి రూపం ర్యాలీ స్పోర్ట్, ఇది పనితీరుకు, ఖచ్చితత్వానికి, డ్రైవింగ్ అనుభూతికి కొన్ని తరాల నుంచి ప్రతీకగా నిలిచింది. స్కోడా వారి విజయబావుటా నుంచి పుట్టిన, RS మోడళ్లు రహదారిపై మోటార్‌స్పోర్ట్-ప్రేరిత ఇంజినీరింగ్‌కి ఒక చక్కని గుర్తుగా మారిపోయాయి. భారతదేశంలో Octavia RS 2004లో మొట్టమొదటి టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ప్యాసింజర్ కారుగా అడుగుపెట్టి, తక్షణమే డ్రైవింగ్ ప్రియులకు అభిమాన కారుగా మారింది. ఇక అప్పటి నుంచి, RS ప్రతి తరం మోడల్ ఒక గొప్ప అందంతో, యూరోపియన్ ఇంజినీరింగ్ నైపుణ్యం మేళవించి, వైవిధ్యభరితమైన డ్రైవింగ్ అనుభూతిని తరతరాలుగా అందిస్తూనే ఉంది.