ప్రముఖ ఆరోగ్య, వెల్నెస్ కంపెనీ, కమ్యూనిటీ, ప్లాట్‌ఫామ్ అయిన హెర్బాలైఫ్ ఇండియా, లిఫ్టాఫ్‌ను
విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది మీరు శక్తివంతంగా, అప్రమత్తంగా ఉండటానికి సహాయపడే కెఫిన్ కలిగి ఉన్న రిఫ్రెషింగ్ ఎఫెర్వెసెంట్ (బుసబుస పొంగే) డ్రింక్. జీరో యాడెడ్ షుగర్‌తో మరియు పుచ్చకాయ రుచిలో అందుబాటులో ఉన్న లిఫ్టాఫ్, చురుకైన, సమతుల్య జీవనశైలిని కోరుకునే వినియోగదారుల కోసం ఒక ఖచ్చితమైన ఎంపికగా రూపొందించబడింది.
చురుకైన జీవనశైలికి మద్దతు ఇచ్చే తమ ప్రయాణంలో పోషకాహార ఫార్మాట్‌లను భారతీయ వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న సమయంలో లిఫ్టాఫ్ మార్కెట్లోకి వచ్చింది. ఈ పరిచయంతో, భారతదేశ న్యూట్రాస్యూటికల్ పానీయాల మార్కెట్‌లో తమ కార్యకలాపాలను హెర్బాలైఫ్ విస్తరిస్తుంది.
ఈ ఆవిష్కరణపై హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఖన్నా మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణ వినియోగదారులకు వినూత్న పోషకాహార పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావటం పట్ల మా నిరంతర నిబద్ధతను ప్రతిధ్వనిస్తుంది. అభివృద్ధి చెందుతున్న జీవనశైలి అవసరాలను తీర్చడం, ప్రజలు ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాలను గడపడానికి శక్తినిచ్చే ఉత్పత్తులను అందించడం పట్ల మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. లిఫ్టాఫ్ అనేది సైన్స్-ఆధారిత సూత్రీకరణ, ఇది నేటి భారతీయ వినియోగదారుల నడుమ నిజంగా ప్రతిధ్వనించే హెర్బాలైఫ్ యొక్క పోషకాహార ఆధారిత ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో భాగంగా శక్తివంతంగా, అప్రమత్తంగా ఉండటానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది అని అన్నారు.
లిఫ్టాఫ్‌లో కెఫిన్, ఆల్పినియా గలాంగా సారం, విటమిన్లు ఉన్నాయి. చురుకైన, ఆధునిక జీవనశైలి కోసం సైన్స్-ఆధారిత పోషకాహారంపై హెర్బాలైఫ్ దృష్టి పెట్టడాన్ని ఇది నొక్కి చెబుతుంది. ప్రతి సర్వింగ్ 80 మిల్లి గ్రాములు కెఫిన్‌ను అందిస్తుంది, కెఫిన్ మీకు శక్తినివ్వడానికి, అప్రమత్తంగా ఉండటానికి, దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. సహజంగా థర్మోజెనిక్, జీవక్రియను తాత్కాలికంగా పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో 300 మిల్లి గ్రాములు వైద్యపరంగా పరీక్షించబడిన ఆల్పీనియా గలాంగా సారం కూడా ఉంది, ఇది చురుకుదనం, ప్రశాంతత భావాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చూపబడింది. వీటితో పాటుగా విటమిన్ సి, బి విటమిన్లు (బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 7, బి 12) సాధారణ శక్తినిచ్చే జీవక్రియకు దోహదపడతాయి, అలసట, నీరసంను తగ్గించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాల రక్షణకు మద్దతు ఇస్తాయి. లిఫ్టాఫ్‌లో స్టెవియా ఆకుల నుండి తీసుకోబడిన నాన్-క్యాలరీ స్వీటెనర్ స్టెవియోల్ గ్లైకోసైడ్, బీట్‌రూట్ పొడి నుండి తీసుకోబడిన సహజ రంగు ఉంటుంది. కృత్రిమ రంగులు లేదా అదనపు నిల్వకారకాలు ఏవీ జోడించబడలేదు.