భారతీయ యువతలో సంతానోత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యం అవగాహన: FOGSI- USAID ‘పంఖ్ ఇనిషియేటివ్’

సోమవారం, 28 జూన్ 2021 (22:08 IST)
U.S. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) భాగస్వామ్యంతో ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI) ఈ రోజు యువతలో సంతానోత్పత్తి ఆరోగ్య సమస్యలపై ఎక్కువ అవగాహన కల్పించడానికి పంఖ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది.
 
పంఖ్, అంటే హిందీలో “రెక్కలు” అని అర్థం, సిగ్గు పడకుండా, మొహమాటం లేకుండా సురక్షితమైన లైంగిక ప్రవర్తన మరియు సరైన గర్భనిరోధక వాడకం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా FOGSI సభ్యుల వైద్యులు మరియు యువత మధ్య తీర్పు లేని, సాంకేతికంగా ఖచ్చితమైన సంభాషణలను సులభతరం చేయడానికి ఇనిషియేటివ్ ‘టాక్ బెఝిఝక్’ (సంకోచం లేకుండా మాట్లాడండి) ప్రచారాన్ని ప్రవేశపెడుతుంది.
 
FOGSI సభ్యులు యువత మరియు కౌమారదశలో ఉన్నవారు లైంగిక మరియు సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి ప్రశ్నలు అడగవచ్చు మరియు జిజాక్, గర్భనిరోధకం మరియు లైంగిక ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడేటప్పుడు వారు తరచుగా ఎదుర్కునే సంకోచాన్ని తొలగించవచ్చు. ఈ ప్రచారంలో అనామక హెల్ప్‌లైన్ ఉంటుంది. 1800 258 0001- ఇక్కడ శిక్షణ పొందిన సలహాదారులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉంటారు మరియు అవసరమైనప్పుడు క్లినిక్‌లలో ముఖాముఖి సంప్రదింపులను సులభతరం చేయవచ్చు.
 
కోవిడ్-19 మహమ్మారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలతో సహా సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించింది. లాక్డౌన్ సమయంలో గర్భనిరోధక ఎంపికలకు ప్రాప్యత లేకపోవడం 2.7 మిలియన్ల అవాంఛిత గర్భాలకు కారణమైందని అంచనా, అలాగే గర్భనిరోధకాలు మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన అవసరమైన సందేశాలను కోవిడ్ -19 సమస్యలు కనిపించకుండా చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కౌమారదశ మరియు 10-24 సంవత్సరాల యువత జనాభా భారతదేశంలోనే ఉంది, ఖచ్చితమైన పునరుత్పత్తి ఆరోగ్య సమాచారం మరియు సేవల పరిమిత లభ్యత మరియు వారి అవసరాలను లక్ష్యంగా చేసుకుని యువకులు కష్టపడుతున్నారు.
 
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, USAID/ఇండియా హెల్త్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అమిత్ షా ఇలా వ్యాఖ్యానించారు: "USAID/ఇండియా కౌమారదశ మరియు యువకుల ప్రయోజనాలను మెరుగుపర్చడానికి మరియు యువతలో సంతానోత్పత్తి ఆరోగ్యం మరియు కుటుంబ నియంత్రణ యొక్క నిరాశా, నిస్పృహలకు  ప్రతిస్పందించడానికి అనేక కార్యక్రమాలకు మద్దతును అందించింది. ఈ భాగస్వామ్యంలో FOGSI తో చేరడం పట్ల USAID గర్వంగా ఉంది, ఇందులో భాగంగా యువతకు పునరుత్పత్తి ఆరోగ్య సలహా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ”
 
ప్రారంభోత్సవ సమయంలో, కౌమార మరియు యువత స్నేహపూర్వక ఆరోగ్య సేవల (AYFHS) కోసం FOGSI మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది యువతకు అధిక నాణ్యత, విశ్వసనీయమైన మరియు తీర్పు లేని సేవలను అందించడానికి సూచన పత్రంగా ప్రొవైడర్లచే ఉపయోగించబడుతుంది.
 
FOGSI ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శాంత కుమారి తన భావాలను ఇలా జోడించారు: “కౌమారదశ అనేది పురుషులు మరియు మహిళలకు అత్యంత ముఖ్యమైన మరియు ఖచ్చితమైన దశలలో ఒకటి, శారీరక, మానసిక, లైంగిక మరియు సామాజిక సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఆరోగ్యకరమైన యువత ప్రతి దేశానికి వెన్నెముక వంటివారు. పరిస్తుతులను మార్చడానికి మరియు AYFHS సేవలకు మార్గదర్శకాలను ఏర్పాటు చేయడానికి FOGSI చర్యలు తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW), భారత ప్రభుత్వం (GOI) యొక్క కౌమార ఆరోగ్య విభాగం యొక్క సీనియర్ అధికారుల నుండి సాంకేతిక మార్గదర్శకాల ద్వారా ఈ మార్గదర్శకాలను మెరుగుపరచినందుకు మేము సంతోషిస్తున్నాము ”.
 
FOGSI యొక్క తక్షణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అల్పేష్ గాంధీ ఇలా అన్నారు: "ఈ వయస్సులో ఉన్నవారి అవసరాలకు సున్నితంగా స్పందించడానికి ఎక్కువ అవగాహన మరియు ఆరోగ్య సంరక్షణ అభ్యాసకులు అవసరం. AYFHS మార్గదర్శకాలను సంభావితీకరించడంలో అలాగే ముసాయిదాలో పాల్గొన్న FOGSI సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన క్రియాశీల దశ, దీనిని ప్రస్తుత ఆరోగ్య పంపిణీ వ్యవస్థ సులభంగా స్వీకరించవచ్చు. FOGSI సభ్యులందరూ మార్గదర్శకాలను మరియు పంఖ్ ఇనిషియేటివ్‌ను అనుసరించమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇంకా మెరుగ్గా ఏమి చేయగలం అనే దానిపై సలహాల కోసం మేము ఎదురుచూస్తున్నాము. ”
 
ప్రాజెక్ట్ లీడ్ (FOGSI-USAID ప్రాజెక్టులు) డాక్టర్ జయదీప్ ట్యాంక్ ఇలా మాట్లాడారు: "పంఖ్ మార్గదర్శకాలు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి మరియు నాణ్యమైన లైంగిక మరియు సంతానోత్పత్తి ఆరోగ్య సేవలకు మద్దతును అందివ్వడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రైవేట్ హెల్త్‌కేర్ సేవల్లో సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం ప్రాథమిక ఉద్దేశం, అయితే అవి NGOలు మరియు ప్రభుత్వ రంగం నిర్వహిస్తున్న సౌకర్యాలకు సమానంగా వర్తిస్తాయి. ప్రమాణాల అమలు యొక్క అంతిమ ఉద్దేశ్యం ”మెరుగైన ఆరోగ్య ఫలితాలకు దోహదం చేయడానికి ముఖ్యంగా SRH- సంబంధిత సేవల వినియోగాన్ని పెంచడం.”
 
సెక్రటరీ జనరల్ డాక్టర్ మాధురి పటేల్ ఇలా అన్నారు, "అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భాగస్వామ్యాలకు పిలుపునిచ్చే SDG 17 యొక్క ప్రేరేపించే శక్తిలో, ఈ స్థాయి మరియు సంక్లిష్టత యొక్క సమస్యకు ఎక్కువ మంది భాగస్వాములు చేతులు కలపడం అవసరం. 4 పైలట్ నగరాలను దాటి పంఖ్ ఇనిషియేటివ్ ను పెంచడానికి మరిన్ని కార్పొరేట్లు, ఫౌండేషన్లు, పరోపకారులు, దాతలు మరియు అభివృద్ధి సంస్థలను ఈ లక్ష్యంలో భాగం చెయ్యాలని FOGSI చూస్తోంది. యువత ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడం ద్వారా భారతదేశ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలని మేము వారిని కోరుతున్నాము.
 
భారతదేశం యొక్క యువత సమైక్యత పెద్దది మరియు వృద్ది చెందుతుంది మరియు వారు ఈ రోజు క్లిష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి అలాగే సరైన ఎంపికలు చేయడానికి మరియు వారి భవిష్యత్తు కోసం వారి లక్ష్యాలను గ్రహించడానికి వారికి సరైన సమయంలో మద్దతు అవసరం. FOGSI భాగస్వాములతో కూడి దేశం కోసం డైనమిక్ పరివర్తనను ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది, ఉత్పాదకత డివిడెండ్ మరియు అందరికీ వృద్ధి మార్గాలను తీసుకువస్తుంది.”

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు