ఈజీగా పర్సనల్ లోన్ పొందాలంటే.. ఎల్ఐసీలో ఇలా తీసుకోవచ్చు..?

సోమవారం, 28 జూన్ 2021 (19:47 IST)
ఎల్ఐసీ పాలసీదారులు ఇకపై ఈజీగా పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ పొందాలంటే.. పాలసీని తనఖా పెట్టాలి. పర్సనల్ లోన్‌పై బ్యాంకులు వసూలు చేస్తే వడ్డీ రేటు కన్నా ఎల్‌ఐసీ పాలసీపై పొందే రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ 10.5 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అయితే అన్ని రకాల పాలసీలపై రుణ సౌకర్యం పొందటానికి వీలుండదు. టర్మ్, హెల్త్ ప్లాన్లపై లోన్ తీసుకోలేం. 
 
మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ వంటి పలు రకాల పాలసీలపై లోన్ పొందొచ్చు. అయితే మీ పాలసీ సెరండర్ విలువలో 90 శాతం మొత్తం వరకే ఎల్‌ఐసీ రుణం అందిస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ వంటి డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంటు కచ్చితంగా ఇవ్వాలి. ఇకపోతే పాలసీపై లోన్ తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం కచ్చితంగా మూడేళ్లు చెల్లించాలి ఉండాలి.
 
కనీసం 6 నెలల టెన్యూర్‌తో లోన్ పొందాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ డబ్బులను ఏడాదికి రెండు సార్లు కట్టేస్తూ రావాలి. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే.. ఎల్‌ఐసీ మీ పాలసీ డబ్బుల్లో లోన్ డబ్బులను కట్ చేసుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు