తాను కుటుంబంతో జీవితాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్నానని, అలాగే రాజకీయాల్లోకి వెళ్లొద్దని తన భార్య తనను కోరిందని, ఒకవేళ తన మాట వినకుండా రాజకీయాల్లోకి వెళ్తే తనను వదిలేస్తానని భార్య తెగేసి చెప్పినట్లు రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ప్రస్తుతం ఆధ్యాపకుడిగా పనిచేయడం సంతృప్తినిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్)తో కొంతమేర ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని, పేదలకు నగదును అందించడం ద్వారా వారికి అవసరమైన నిత్యవసరాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రఘరామ్ రాజన్ అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.