రాజకీయాల్లోకి అడుగుపెడతానంటున్న కుర్ర హీరోయిన్..

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:48 IST)
భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఎక్కడ చూసినా ఎన్నికల స్టంట్ నడుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా సరే నెటిజన్లు వాటిని విపరీతంగా చూస్తున్నారు. సెలబ్రిటీలు ఎన్నికల గురించి మాట్లాడితే..అలాంటి న్యూస్ హాట్ టాపిక్‌గా మారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇలాంటి వార్తలు వైరల్‌గా మారుతున్న తరుణంలో మరో బాలీవుడ్ హాట్ హీరోయిన్ పాలిటిక్స్ గురించి ఓ హాట్ న్యూస్ చెప్పింది. 
 
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని పేర్కొంది. ఫస్ట్ సినిమాతో బాలీవుడ్‌లో ఆకట్టుకున్న ఈ సెలబ్రిటీ హీరోయిన్, రణ్‌వీర్ సింగ్‌తో చేసిన సింబా మూవీ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. 
 
అదేమిటి ఆమె మొన్ననే కదా ఆమె సినిమాల్లోకి వచ్చింది..అప్పుడే రాజకీయాలేమిటి అనుకుంటున్నారా..అదేమి లేదండీ..సినిమా అవకాశాలు తగ్గిపోయాక తాను రాజకీయాల్లోకి వస్తానని సారా అంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు