దీపావళి దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం కోనుగోళ్లు పెరగడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. శనివారం దేశంలోని పలు చోట్ల బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై రూ.100 వరకు పెరిగింది. శనివారం ఉదయం లెక్కల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు పరిశీలిస్తే,
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,959వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శనివారం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,070 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.47,070 గా ఉంది.
అలాగే, హైదారాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,800 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,870గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,800గా ఉంది.