దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. పండగ పూట కూడా ఈ ధరల పెరుగుదలను చమురు కంపెనీలు ఆపడం లేదు. శనివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.
తాజాగా లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వరుసగా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100పైనే ఉంది.