నారీమణులకు శుభవార్త - పుత్తడి ధర నేలచూపు

గురువారం, 17 మార్చి 2022 (10:03 IST)
మహిళలకు శుభవార్త. ఉక్రెయిన్, రష్యాల దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆరంభంలో బంగారు, వెండి ధరలు చుక్కలను తాకాయి. అయితే, ఈ యుద్ధం ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో పుత్తడి, వెండి ధరలు ఇపుడు క్రమంగా దిగివస్తున్నాయి. 
 
గురువారం బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం వీటి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా వుంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా వుంది. అయితే, తులం బంగారం ధరపై మాత్రం రూ.300 (22 క్యారెట్లు), 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.330 మేరకు పెరిగింది. 
 
ఇక వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించిది. కేజీ వెండి ధరపై రూ.1,100 మేరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా వుంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గాను, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు