రష్యాలో కోవిడ్ 19 వ్యాక్సిన్‌కు అక్కడ ప్రభుత్వం ఓకే చెప్పడంతో పాటు, ఇతర వ్యాక్సిన్‌లు కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తున్నాయనే వార్తలతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర వరుసగా రెండు రోజుల్లో మూడు వేల రూపాయలకు పైగా తగ్గింది. దీంతో మదుపుదారులు బంగారంపై ప్రాఫిట్ బుకింగ్ చేయడం విశేషం.
గ్లోబల్ మార్కెట్లలో, స్పాట్ బంగారం ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి 2,021 డాలర్లకు చేరుకోగా, యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇలాంటి శాతం పాయింట్లు తగ్గి 2,034 డాలర్లకు చేరుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతలు పెరగడం కోవిడ్-19 కేసులు పెరగడం ధరల తగ్గుదలకు కాస్త బ్రేక్ పడింది.