కరోనాకు వ్యాక్సిన్... తొలి ఇంజెక్షన్ అధినేత కుమార్తెకు .. రష్యా ప్రకటన

మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:16 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినట్టు రష్యా అధికారికంగా ప్రకటించింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని రష్యా పదేపదే ప్రకటిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ఆ ప్రకటనలను నిజం చేస్తూ రష్యా ఇపుడు ప్రపంచానికి శుభవార్త చెప్పింది. 
 
రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాక్సిన్‌పై అధికారికంగా ప్రకటన చేశారు. తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ ప్రకటన చేశారు. 
 
ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందన్నారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది.
 
కరోనా వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయమే రిజిస్టర్ చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేయించిన తొలి దేశం తమదేనని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అమెరికాతో పాటు.. భారత్, చైనా, ఇజ్రాయేల్ వంటి దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనవున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు