బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

శనివారం, 18 సెప్టెంబరు 2021 (09:49 IST)
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. భారీగా తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 600 తగ్గి రూ. 43,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 650 తగ్గి రూ. 47,350 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా… వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 1,200 తగ్గి రూ. 61,600 వ‌ద్ద కొనసాగుతోంది. 
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది. అలాగే ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది. తులం బంగారంపై తాజాగా.. రూ.390 మేర ధర తగ్గింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు