ఆంధ్రప్రదేశ్ కోవిడ్ 19 రాత్రి కర్ఫ్యూ సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

శనివారం, 18 సెప్టెంబరు 2021 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాత్రి కర్ఫ్యూను సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు ఒకవైపు, మరోవైపు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూలను కొనసాగించాలని గతంలో నిర్ణయించింది.
 
ఇప్పటివరకు రాష్ట్ర మొత్తం కేసుల సంఖ్య 2,031,974. మరణాల సంఖ్య 14,019కి చేరిందని ఆరోగ్య శాఖ నుండి ఒక బులెటిన్ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 14,412గా నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాష్ట్రం రెండు మైలురాళ్లను కూడా అధిగమించింది. మొత్తం 3.5 కోట్ల వ్యాక్సిన్ పూర్తయింది. ఒక కోటి మందికి రాష్ట్రంలో రెండు డోసులు ఇచ్చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు