కరోనా వైరస్ ఎఫెక్ట్.. బంగారం రూ.50 వేలు?

బుధవారం, 11 మార్చి 2020 (11:50 IST)
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్‌‌ చేస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇండియాలో పది గ్రాముల బంగారం ధర మూడు నెలల క్రితం రూ.42,000 స్థాయిలో ఉండగా, సోమవారం నాటికి రూ.45,500 స్థాయికి పెరిగింది. 
 
ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీటికి తోడు భారత రూపాయి అమెరికా డాలరుతో బలహీనపడుతుండడం, గ్లోబల్‌‌ సెంట్రల్‌‌ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ముంబై జ్యువలరీ అసోసియేషన్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ కుమార్ జైన్‌‌ అన్నారు.
 
పెళ్లిళ్ల సీజన్‌‌ ప్రారంభమవ్వడంతో బంగారానికి మరింత డిమాండ్‌‌ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా, పది గ్రాముల బంగారం రానున్న అక్షయ తృతీయనాటికి (అంటే ఏప్రిల్‌‌ 26వ తేదీకి) రూ.50,000 స్థాయిని తాకినా ఆశ్చర్యపోవక్కర్లేదని కుమార్‌‌‌‌ తెలిపారు. ఔన్స్‌‌ గోల్డ్‌‌ ధర ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లో 1,7‌‌‌‌00 డాలర్లకు చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు