దేశంలో బంగారం ధరలు క్రమేణా తగ్గుతున్నాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ తగ్గుతున్న ధరలు ఆభరణాల ప్రేమికులను ఊరిస్తున్నాయి. 10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరి, అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన చెందినవారు, ఇప్పుడు సంతోషంగా ఆభరణాలను కొనుక్కోవచ్చు.
ఆదివారం 100 గ్రాముల బంగారం ధర రూ.7,600 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ.43,920కి తగ్గింది. ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.44,974 వద్ద ప్రారంభమైంది. ఒక రోజు తర్వాత 100 గ్రాములకు రూ.100 చొప్పున తగ్గింది. మార్చి 23న 100 గ్రాములకు రూ.1,200 తగ్గింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ తగ్గుదల కొనసాగింది.
ఢిల్లీ - రూ.44,050, ముంబై - రూ.43,000, చెన్నై - రూ.42,320, అహ్మదాబాద్ - రూ.44,440, కేరళ - రూ.41,900, లక్నో - రూ.44,050, బెంగళూరు - రూ.41,900, పుణే - రూ.43,000, విశాఖపట్నం - రూ.41,900, జైపూర్ - రూ.44,050, పాట్నా - రూ.43,000, చండీగఢ్ - రూ.44,050 చొప్పున ఉన్నాయి.