ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) జూలై నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు ఆమోదముద్ర వేశాయి. దీంతో జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
గోధుమలు, బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, పెరుగు, తేనె, కూరగాయలు, పండ్లు, బెల్లం, శనగపిండి, ప్యాకింగ్ చేయని పన్నీర్, ఉప్పు, వెజిటబుల్ ఆయిల్స్, గాజులు, బొట్లు, కుంకుమ, అప్పడాలు, జ్యాడీషియల్ డాక్యుమెంట్లు, స్టాంపులు, చేనేత వస్తువులు, ప్రింట్ చేసిన పుస్తకాలు, గర్భనిరోధక వస్తువులు.
అలాగే, బీమా, బ్యాంకింగ్ సర్వీసులు మరింత భారం కానుంది. మొబైల్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, బ్యాంకింగ్ చార్జీలు, ఇంటర్నెట్, వైఫై, డీటీహెచ్ సేవలు ప్రియం కానున్నాయి. 12 శాతం పన్ను విధించడంతో దాదాపు అన్ని మొబైల్ ఫోన్ల ధరలు 4 నుంచి 5 శాతం ధరలు పెరుగుతాయి. రవాణా, రైలు, బస్సు, విమాన ప్రయాణాలు, టెలికాం, బీమా, హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు, కొరియర్, బ్యాంకింగ్, హెయిర్ కటింగ్, ఇ-కామర్స్‌తో సహా వివిధ రకాల సర్వీసులను 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబుల్లో చేర్చారు.