మరోవైపు, 10 రూపాయల నాణేలు చెల్లవని ఈ మధ్య ఉదంతులు వచ్చాయి. గతేడాది ఆర్బీఐ ఈ పుకార్లను కొట్టిపారేంసింది. ఇప్పటివరకు విడుదల చేసిన 14 డిజైన్‌ల నాణేలు చెల్లుతాయని చెప్పింది. రూ.20 నాణెం కొత్తగా ఉండబోతోంది. 10 రూపాయల నాణెం లాగా దీనికి కూడా రెండు రింగులు ఉంటాయి.
వెలుపలి రింగ్‌ని 65శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌తో తయారు చేస్తుండగా, లోపలి రింగ్ 75 శాతం కాపర్, 20 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో తయారు చేయనున్నారు. అయితే ఈ నాణేన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారో ఆర్థిక శాఖ స్పష్టం చేయలేదు.