కేంద్రం దెబ్బకు దిగిరానున్న వంట నూనెల ధరలు

సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:52 IST)
దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి, వంట నూనెల ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముడిపామాయిల్ దిగుమతి సుంకాన్ని 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అలాగే, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ యేడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుండగా దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడగించింది. ఇక సెస్ తగ్గింపు, ముడిపామాయిల్ దిగుమతి పన్నుల మధ్య అంతరం పెరుగుతుంది. దీంతో దేశంలోని రిఫైనర్లకు పామాయిల్ మరింత చౌకగా దిగుమతి కానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు