ఇండియా నుంచి కాటన్, షుగర్ దిగుమతి చేసుకుంటాం.. చెప్పిందెవరంటే?

బుధవారం, 31 మార్చి 2021 (20:19 IST)
Sugar_Cotton
దేశంలో కాటన్, షుగర్‌కు కొరత ఏర్పడటంతో భారత్‌పై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి అహ్మద్ అజార్ పేర్కొన్నారు. ఇతర దేశాల కంటే ఇండియా నుంచి తక్కువ ధరకు కాటన్ ఎగుమతి అవుతుంది. అటు షుగర్ కూడా పాక్‌కు తక్కువ ధరకే ఇండియా అందిస్తుంది. జూన్ 30, 2021 నుంచి ఇండియా నుంచి కాటన్, షుగర్ పాక్‌కు ఎగుమతి కాబోతున్నాయి. 
 
ఇండియా నుంచి పెద్ద ఎత్తున కాటన్‌ను దిగుమతి చేసుకుంటే, అది పాక్‌లోని మధ్య, చిన్నకారు రైతులపై ప్రభావం పడుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని వారిపై ప్రభావం పడకుండా దిగుమతి చేసుకుంటామని పాక్ అధికారులు చెప్తున్నారు. ఆర్ధిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో వాణిజ్యశాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
 
కాగా.. ఇండియా-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని రివోక్ చేసిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇండియా దిగుమతులపై నిషేధం విధించింది. గతంలో ఉల్లి, టమోటోతో పాటు, మెడిసిన్స్ పై కూడా ఆ దేశం ఆంక్షలు విధించింది. ఆ తరువాత ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో నిషేధం ఎత్తివేసింది. 
 
కాటన్, షుగర్‌పై కూడా పాక్ నిషేధం విధించింది. 19 నెలలుగా ఈ నిషేధం అమల్లో ఉన్నది. అయితే, దేశీయంగా కాటన్, షుగర్ కు కొరత ఏర్పడటంతో ఇండియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్టు పాక్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు