కన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధరలు

గురువారం, 5 మే 2022 (15:00 IST)
పచ్చి మిర్చి ధర సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కేజీ మిర్చి ధర 60 రూపాయలు పలుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి.

ప్రైవేటు మార్కెట్లలో అయితే ఇష్టమొచ్చిన ధరలు చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అలాగే అన్ని కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కేజీ టమాట ధర 60 పలుకుతుంది. రైతులు ఈ ఏడాది టమాటా సాగు తక్కువగా చేశారని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాట నిల్వలు లేక ధరలు పెరుగుతున్నాయంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు