సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ నుంచి భద్రాచలం ఐటీసీ పేపర్‌బోర్డ్స్ యూనిట్‌కి గ్రీన్‌కో ప్లాటినమ్ ప్లస్ రేటింగ్
మంగళవారం, 4 ఆగస్టు 2020 (14:25 IST)
భద్రాచలంలో ప్రపంచశ్రేణి సమగ్రమైన సదుపాయం కలిగిన ఐటీసీ యొక్క పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ బిజినెస్ (పీఎస్‌పీడీ)ను గ్రీన్‌కో ప్లాటినమ్+ రేటింగ్‌తో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గ్రీన్ బిజినెస్ సెంటర్ గుర్తించింది. గ్రీన్ కంపెనీ రేటింగ్ వ్యవస్థలో భాగం గ్రీన్ బిజినెస్ సెంటర్. పల్ప్ అండ్ పేపర్ రంగంలో ఈ గుర్తింపు పొందిన ఒకే ఒక్క మరియు దేశంలో మొత్తంమ్మీద ఈ రేటింగ్ పొందిన రెండవ కంపెనీగా ఐటీసీ యొక్క పీఎస్‌పీడీ నిలిచింది.
ఈ ప్రతిష్టాత్మక రేటింగ్‌ను, పర్యావరణ పరిరక్షణ కోసం నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూనే, పూర్తి నిబద్ధత ప్రదర్శించే కంపెనీలకు అందిస్తారు. స్థిరమైన వ్యాపార ప్రక్రియలు మరియు వాతావరణ మార్పులతో పోరాడేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల ఐటీసీ యొక్క నిబద్ధతకు గుర్తింపు ఈ రేటింగ్. ఐటీసీ సంస్థ గత 15 సంవత్సరాలుగా కార్బన్ పాజిటివ్‌గా నిలువడంతో పాటుగా 18 సంవత్సరాలుగా వాటర్ పాజిటివ్ మరియు ఘన వ్యర్థాల రీసైక్లింగ్ పాజిటివ్‌గా 13 సంవత్సరాలుగా గుర్తింపు పొందింది.
గ్రీన్‌కో ప్లాటినమ్ ప్లస్ రేటింగ్ ఇప్పుడు భద్రాచలం యూనిట్‌ను ఇతర అంతర్జాతీయ సదుపాయాలతో సమానంగా గ్రీన్ ప్రమాణాలను కలిగి ఉందని వెల్లడించింది. పర్యావరణ శ్రేష్టత చేరుకోవడంలో వ్యాపారం యొక్క భారీ స్థాయి ప్రయత్నాలకు నిదర్శనమిది. దక్షిణాసియాలో అగ్రశ్రేణి ప్యాకేజింగ్ మరియు గ్రాఫిక్ బోర్డ్స్ తయారీదారునిగా ఐటీసీ యొక్క పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్ బిజినెస్ ఎంతోకాలంగా ప్రతిష్టాత్మకమైన పర్యావరణ నాయకత్వ చిహ్నంగా మారడానికి ప్రయత్నిస్తుంది.
ఈ గుర్తింపు గురించి శ్రీ సంజయ్ సింగ్, కార్పోరేట్ మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్, ఐటీసీ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఐటీసీ యొక్క ట్రిపుల్‌బాటమ్ లైన్ సిద్ధాంతానికనుగుణంగా, పర్యావరణ వనరుల పరిరక్షణ మరియు వాటికి పునర్జీవనం చేయడంలో ముందుండటానికి పీఎస్‌పీడీ యొక్క నిబద్ధత, పర్యావరణ మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సమన్వయం చేయడానికి సహాయపడుతుంది. గ్రీన్‌కో ప్లాటినమ్+ రేటింగ్ అనేది వాతావరణ మార్పులతో పోరాడేందుకు మా భద్రాచలం యూనిట్ యొక్క భారీస్ధాయి ప్రయత్నాలకు గుర్తింపు.
మా స్థిరమైన గ్రీన్ ప్రయత్నాలు ఇప్పుడు పల్ప్ మరియు పేపర్ రంగంలో ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలను అందుకున్న ఒకే ఒక్క కంపెనీగా తమను నిలిపాయి. సానుకూల వాతావరణ మార్పులను సృష్టించే దిశగా మా జోక్యములు మరియు కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ గౌరవం మమ్మల్ని ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
సమగ్రమైన కార్యాచరణ కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి రేటింగ్ వ్యవస్థ గ్రీన్ కంపెనీ రేటింగ్ వ్యవస్థ. ఇది పలు సంస్థల యొక్క గ్రీన్ ఫీచర్లను 10 విస్తృత శ్రేణి గ్రీన్ పారామీటర్లు అయినటువంటి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక శక్తి, సీహెచ్‌జీ ఉద్గారాలు, నీటి పొదుపు, వ్యర్థాల నిర్వహణ, మెటీరియల్ పరిరక్షణ, గ్రీన్ సరఫరా చైన్, ప్రొడక్ట్ స్టీవార్డ్‌షిప్, లైఫ్‌సైకిల్ ఎస్సెస్‌మెంట్, పర్యావరణం కోసం ఆవిష్కరణ, గ్రీన్ మౌలిక సదుపాయాలు వంటి వాటిని పరిశీలిస్తుంది.
ఈ రేటింగ్ వ్యవస్థను భారతదేశపు ఇంటెండెడ్ నేషనల్లీ డిటెర్మైండ్ కంట్రిబ్యూషన్ (ఐఎన్‌డీసీ) డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. ఐఎన్‌డీసీ డాక్యుమెంట్‌ను వాతావరణ మార్పుతో పోరాటం దిశగా భారత పరిశ్రమలు/ ప్రైవేట్ రంగం చేస్తున్న చురుకైన వలెంటరీ చర్యలను తెలుపడంలో భాగంగా 2015లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (యుఎన్‌ఎఫ్‌సీసీసీ)లో సమర్పించారు.
ఐటీసీ యొక్క పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్ బిజినెస్ ఒక సమగ్రమైన, స్థిరమైన అటవీ విలువ గొలుసును అమలుచేసింది. ఇది భారీస్థాయిలో గ్రీన్ కవర్‌ను సృష్టించడంతో పాటుగా గిరిజనులు మరియు సన్నకారు రైతులకు జీవనోపాధిని సృష్టించింది. ఈ వ్యాపారం ఫైబర్ సోర్సింగ్ వ్యూహాన్ని స్వీకరించింది. దీనిద్వారా సన్నకారు రైతులు మరియు గిరిజన ప్రాంత గ్రామస్తులు మొక్కలను పెంచుతున్నారు. ఇది 8 లక్షల ఎకరాలలో పచ్చదనం సంతరించుకునేందుకు ఐటీసీ తోడ్పడేలా చేయగలగడంతో పాటుగా 147 మిలియన్ వ్యక్తిగత దినాల స్థిరమైన జీవనోపాధిని రైతులకు అందించింది.
బాధ్యతాయుతమైన సేకరణ, స్థిరమైన ప్లాంటేషన్‌ను ప్రోత్సహించాలనే ఐటీసీ యొక్క ప్రయత్నాలు ఫారెస్ట్ స్టీవార్డ్‌షిప్ కౌన్సిల్ సర్టిఫికేషన్‌కు అలాగే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ గ్లోబల్ ఫారెస్ట్ అండ్ ట్రేడ్ నెట్‌వర్క్‌లో సభ్యత్వంకు తోడ్పడింది. గతంలో భారతీయ పల్ప్ మరియు పేపర్ పరిశ్రమలో అతి తక్కువ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాల విడుదల చేస్తున్నందుకుగానూ ఐటీసీ గుర్తించబడింది. ఈ వ్యాపారం, ఇంధన సామర్థ్యం మరియు నీటి సంరక్షణ పరంగా అత్యున్నత శ్రేణి పరిశ్రమ బెంచ్‌మార్క్స్‌ను సాధించింది.
పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ వ్యాపారం మొట్టమొదటి బ్లీచ్డ్ కెమీ–థర్మోమెకానికల్ పల్ప్ మిల్‌ను భారతదేశంలో ఏర్పాటుచేసింది. ఇది మొట్టమొదటిసారిగా హార్డ్‌ఉడ్‌ను సాఫ్ట్‌వుడ్ పల్ప్‌గా మార్చింది. తద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటుగా ఈ కారణం కోసం ఆగ్రో-ఫారెస్ట్రీని సైతం ప్రోత్సహిస్తుంది. ఐటీసీ ఇప్పుడు వెల్‌బీయింగ్ ఔట్ ఆఫ్ వేస్ట్ (వావ్) కార్యక్రమం సైతం అమలుచేస్తుంది. భారీస్థాయిలో వ్యర్థ నిర్వహణ ప్రయత్నమిది. దేశంలో ఒక కోటి మంది పౌరులకు నేడు అది విస్తరించబడింది.
ఈ కార్యక్రమాలన్నీ కూడా బిజినెస్ నేతృత్వంలోనే నిర్వహించబడుతున్నాయి మరియు సస్టెయినబిలిటీలో ఐటీసీ యొక్క స్థానానికి ప్రపంచ ఉదాహరణగా నిలిచాయి. మొదటి శ్రేణి ప్లాటినమ్ ప్లస్ రేటింగ్‌ను అందుకున్న దేశంలోని రెండవ కంపెనీగా ఐటీసీ నిలిచింది. ప్రస్తుతం 18 రంగాలలోని 550 కంపెనీలు గ్రీన్‌కో రేటింగ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 260 కంపెనీలు ఈ రేటింగ్‌ను అందుకున్నాయి.