ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మరియు మహారాష్ట్రలలో పాలసేకరణను పెంచిన హాప్‌

గురువారం, 28 జులై 2022 (17:03 IST)
భారతదేశంలో ప్రైవేట్‌ రంగ డెయిరీ కంపెనీ హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ (హాప్‌), తమ బ్రాండ్లు ఆరోక్య, హాట్సన్‌, అరుణ్‌ ఐస్‌క్రీమ్స్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మహారాష్ట్రలలో తమ పాల సేకరణ ప్రణాళికలను విస్తరించినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మహారాష్ట్రలలో 3100 గ్రామాల వ్యాప్తంగా హాప్‌కు పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులు ప్రయోజనం పొందుతున్నారు. హాప్‌ ఇప్పుడు అత్యంత వేగంగా ఈ నెట్‌వర్క్‌ను వృద్ధి  చేయడంతో పాటుగా ఈ రాష్ట్రాలలో తమ సేకరణ కేంద్రాలను సైతం విస్తరించి ఒక లక్ష మందికి పైగా రైతులను చేరుకోవడానికి ప్రణాళిక చేసింది.
 
మారుమూల ప్రాంతాలలో సైతం తమ సేకరణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటూనే, రైతులకు సమీపంలోనే పాల సేకరణ కేంద్రం అందుబాటులో ఉందనే భరోసా అందించడానికి హాప్‌ ప్రణాళిక చేస్తుంది. ఈ తరహా సదుపాయాలు తమ సొంత గ్రామంలోనే ఉండటం వల్ల మార్కెట్‌కు త్వరగా చేరుకోవడం వారికి  సాధ్యమవుతుంది. అది గ్రామీణ రంగంలో సంపద మెరుగుపడేందుకు సైతం అది తోడ్పడుతుంది. హాట్సన్‌ అగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ , రైతుల నుంచి నేరుగా 100% పాలను సేకరించడంతో పాటుగా ప్రొక్యూర్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై  భారీగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా గణనీయమైన సంఖ్యలో పాలను నిర్వహించగలదు.
 
భారతదేశంలో  ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం ద్వారా రైతుల ఆదాయం మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషిచేస్తోన్న మొట్టమొదటి డెయిరీ కంపెనీ హాప్‌. ఈ కంపెనీ యూనివర్శిటీ స్ధాయిలో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా తమ అత్యున్నత దిగుబడి, ప్రొటీన్‌ అధికంగా కలిగిన నేపియర్‌ గ్రీన్‌ షోడర్‌ (కాంబు/బజ్ర) వంటి సీఓ-4 మరియు సీఓ-5లను వాణి జ్యీకరిస్తోంది. అధికశాతం మంది హెచ్‌ఏపీ రైతులు, తమ ఆవుల కోసం పెట్టే మేత ఖర్చును సగానికి పైగా సీఓ-4 మరియు సీఓ-5 హైబ్రిడ్‌ మేత సాగుతో తగ్గిస్తుంది. ఆవు పేడను ఎరువుగా వాడటం, బ్రష్‌-కట్టర్స్‌‌ను కోత కోసం వినియోగించడం వల్ల కార్మికులను అధికంగా వినియోగించకపోవడం ; రెయిన్‌ గన్స్‌ వాడటం వల్ల నీటి వినియోగం తగ్గడం, మిల్కింగ్‌ మెషీన్ల ద్వారా లేబర్‌ ఖర్చు గణనీయంగా తగ్గించడం చేస్తుంది.
 
హాట్సన్‌ అగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ వద్ద పాల సేకరణ విధానం
బరువు, పరీక్ష మరియు బిల్లింగ్‌ అనేవి రైతుల ముందునే చేయడం వల్ల పూర్తి పారదర్శకతను అనుసరిస్తూ రైతులకు భరోసా
 
రైతుల ముందునే ఫ్యాట్‌, ఎస్‌ఎన్‌ఎఫ్‌ పరీక్షల కోసం ఎకో మిల్క్‌ ఎనలైజర్‌
 
డీమానిటైజేషన్‌ కంటే ముందుగానే రైతుల బ్యాంకులకు ప్రత్యక్షంగా నగదు బదిలీ చేయడం ద్వారా నగదు రహిత లావాదేవీల నిర్వహణ. ఈ వ్యవస్థ కారణంగా మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటుగా రైతులకు ఋణ బాధలు కూడా తగ్గాయి.
 
ప్రత్యక్ష చెల్లింపుల కారణంగా  రైతులను ప్రధాన స్రవంతి బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తీసుకువచ్చారు. గతంలో  వీరిని ఆర్ధికంగా మినహాయించడం ద్వారా అప్పుల భారంలో కూరుకుపోయేలా చేశారు.
 
ఖచ్చితంగా పాల బరువును తూచేందుకు ఎలకా్ట్రనిక్‌ వెయింగ్‌ స్కేల్‌
 
రైతుల ప్రాంగణాలకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో  అన్నిసేకరణ కేంద్రాలూ ఉండటం వల్ల పాలు నేరుగా రైతుల వద్ద సేకరించారన్న భరోసా కలుగుతుంది.
 
సమయానికి సేకరణ
 
రూట్‌ వాహనాలకు స్ధిరమైన సమయం. వీటిని ఓ బృందం పర్యవేక్షిస్తుంది.
 
ఫీడ్‌ మరియు ఫోడర్‌ ఇన్‌పుట్స్‌ మార్గాలలో రైతులకు ఎక్స్‌టెన్షన్‌ సేవలు. క్యాటిల్‌ సప్లిమెంట్స్‌ సరఫరా మరియు ఎథ్నో వెటర్నరీ కేర్‌
 
యానిమల్‌ హాజ్జెండరీ సర్వీస్‌లుః కృత్రిమ గర్భధారణలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పశుసంవర్థ నిపుణులు మరియు 1000 మందికి పైగా సేకరణ సిబ్బందితో కూడిన శక్తివంతమైన బృందాల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి తగిన మద్దతు మరియు మార్గనిర్ధేశకత్వం, వ్యాధి నియంత్రణ , టీకాలు మొదలైనవి చేయనున్నారు.
 
హాట్సన్‌ ప్రాసెసింగ్‌ మరియు డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్ధః హట్సన్‌ ఓ సంపూర్ణమైన కోల్డ్‌చైన్‌కు భరోసా అందిస్తుంది. పాల సేకరణ మొదలు ప్రాసెసింగ్‌, సరఫరా చైన్‌ లాజిస్టిక్స్‌ మొదలు పాలు, పాల ఉత్పత్తులు రిటైల్‌ పాయింట్‌కు చేరుకునే వరకూ ఇది ఉంటుంది. ఈ సేకరించిన పాలను మా సొంత ప్రాసెసింగ్‌ సదుపాయాలలో  ప్రాసెస్‌ చేయడంతో పాటుగా 3500కు పైగా హాప్‌ డెయిలీ ఔట్‌లెట్ల ద్వారా పంపిణీ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు