ఇండియా గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ఛాలెంజ్ గోల్డ్ అవార్డులను గెలుచుకున్న విజయవాడ హెచ్‌సీసీబీ
మంగళవారం, 3 ఆగస్టు 2021 (19:49 IST)
దేశంలో అత్యుత్తమ వ్యాపార సంస్థలకు చెందిన తయారీ సదుపాయాలు కొన్నింటితో పోటీపడి, భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీసీబీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియాగ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ఛాలెంజ్ 2021 వద్ద గోల్డ్ అవార్డును తమ ఏడు సదుపాయాలకు అందుకుంది. ఈ అవార్డును ప్రతి సంవత్సరం, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ (ఐఆర్‌ఐఎం) నిర్వహిస్తుంది. ఈ గోల్డ్ అవార్డు అందుకున్న ఫ్యాక్టరీలలో విజయవాడ సమీపంలోని గుంటూరు ఫ్యాక్టరీ కూడా ఉంది.
బాధ్యతాయుతమైన కార్పోరేట్ పౌరుని అవార్డును సైతం హెచ్‌సీసీబీ అందుకుంది. ఈ అవార్డు, గ్రీన్ తయారీ, కమ్యూనిటీ అభివృద్ధి మరియు కార్పోరేట్ పరిపాలన వంటి విభాగాలలో హెచ్‌సీసీబీ కృషిని సైతం గుర్తించింది. ఈ గోల్డ్ అవార్డులను 200 నుంచి 800 పాయింట్ల రేటింగ్ స్కేల్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ ఫ్యాక్టరీ అయితే 700 పాయింట్లకు పైబడి స్కోర్ సాధిస్తుందో అది గోల్డ్ అందుకోవడానికి అర్హత సాధిస్తుంది.
ఈ రేటింగ్‌ను ఫ్యాక్టరీలలో నిర్మాణాత్మక పరిశీలన ద్వారా అందిస్తారు. ఐఆర్‌ఐఎం గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుణంగా 15 సూాల ఆధారంగా ఈ ఎస్సెస్‌మెంట్ ఉంటుంది. ఈ ఎస్సెస్‌మెంట్‌ను ప్రతి సదుపాయం కోసం అనుకూలీకరించడంతో పాటుగా వినూత్నమైన వెయిటేజీని పర్యావరణ ప్రభావం, వ్యాపార అత్యవసరాలు, సంభావ్య విజయం దిశగా సంస్థ ప్రాధాన్యత ఆధారంగా అందిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా అత్యంత కఠినమైన రీతిలో ఫ్యాక్టరీ ప్రాంగణాలలో తనిఖీలనూ నిర్వహిస్తారు.
గోల్డ్ అవార్డులు అందుకున్న ఇతరు ఆరు హిందుస్తాన్ కోకా-కోలా బేవరేజస్ (హెచ్‌సీసీబీ) ఫ్యాక్టరీలలో బెంగళూరు సమీపంలోని రెండు ఫ్యాక్టరీలు (బిడాదీ మరియు అరణ్య), అహ్మదాబాద్ సమీపంలోని రెండు ఫ్యాక్టరీలు (సనంద్ మరియు గోబ్లేజ్), భుబనేశ్వర్ సమీపంలో ఖోర్దా మరియు హైదరాబాద్ సమీపంలోని అమీన్‌పూర్ ఫ్యాక్టరీ ఉన్నాయి.
ఈ గౌరవం పట్ల ఫ్యాక్టరీ మేనేజర్ బి.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రీన్ తయారీ ప్రక్రియల పట్ల మా నిబద్ధతను గుర్తించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఓ కంపెనీగా, ప్రమాణాలకు ఆవల వెళ్తూ, మా భద్రతా సంస్కృతిని బలోపేతం చేసుకుంటూనే, నీరు, విద్యుత్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, వ్యర్థాల నిర్వహణ మరియు ఎస్సెట్ యుటిలైజేషన్ వంటివి పొదుపుగా వాడతామని భరోసా అందిస్తున్నాం. మా బృంద సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అత్యంత సవాల్‌తో కూడిన మహమ్మారి పరిస్థితులలో సైతం మేము మా ఫ్యాక్టరీలలో మేము స్థిరంగా పెట్టుబడులు కొనసాగిస్తున్నాం మరియు మరెన్నో అవార్డులను అందుకోగలమని విశ్వాసంతో ఉన్నాం అని అన్నారు.
ఇతర అంశాల పరంగా కూడా హెచ్‌సీసీబీ ఫ్యాక్టరీలు పలు అవార్డులను అందుకున్నాయి. బయోఫ్యూయల్‌ను తమ బాయిలర్లలో వినియోగించడం; 100% ఎల్‌ఈడీ లైటెనింగ్ చేరుకోవడం; నూతన మరియు పునురుత్పాదక ఇంధన వనరుల వినియోగం; ప్లాస్టిక్ వ్యర్థాల పునర్న్వియోగం; పలు కార్యక్రమాల ద్వారా ముడి పదార్థాల వినియోగం తగ్గించడం వంటివి ఉన్నాయి.